ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో బోపన్నకు జోడీగా బెన్​ - Australian Open

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో జోడీ కోసం ఎదురుచూస్తున్న భారత ప్లేయర్​ బోపన్నకు భాగస్వామి దొరికాడు. జపాన్​ ఆటగాడు బెన్​ మెక్​లాచ్లన్​తో కలిసి పురుషుల డబుల్స్​లో ఆడనున్నాడు.

Ben McLachlan paired with Bopanna at the Australian Open
ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో బోపన్నకు జోడీగా బెన్​
author img

By

Published : Jan 31, 2021, 8:15 AM IST

ఈ ఏడాది తొలి గ్రాండ్​స్లామ్​ టోర్నీ ఆస్ట్రేలియన్​ ఓపెన్​ పురుషుల డబుల్స్​లో పోటీపడేందుకు భారత ఆటగాడు రోహన్​ బోపన్నకు జోడీ కుదిరింది. జపాన్​కు చెందిన బెన్​ మెక్​లాచ్లన్​తో అతను జతకట్టనున్నాడు. జావో సోసా (పోర్చుగల్​)తో కలిసి బోపన్న ఆడాల్సింది. కానీ అతనికి కరోనా సోకడం వల్ల టోర్నీ నుంచి తప్పుకున్నాడు. మరోవైపు బెన్​ భాగస్వామి రావెన్​ కూడా పోటీ నుంచి వైదొలిగాడు.

"అదృష్టవశాత్తూ నాకు భాగస్వామి దొరికాడు. బెన్​తో కలిసి ఆడే రావెన్​ వైరస్​తో టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల అతను మరో భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. దీంతో మేం కలిసి ఆడాలని నిర్ణయించుకున్నాం" అని 14 రోజుల కఠిన క్వారంటైన్ పూర్తి చేసుకున్న బోపన్న తెలిపాడు.

వచ్చే నెల 8న ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఆరంభం కానుంది. భారత్​ నుంచి పురుషుల డబుల్స్​లో దివిజ్​ శరణ్​, సింగిల్స్​లో సుమిత్​ నగాల్​ పోటీపడనున్నారు. మహిళల సింగిల్స్​లో 'లక్కీ లూసర్'​ కింద ఆడే అవకాశం దక్కుతుందేమోనని అంకిత రైనా ఎదురు చూస్తోంది.

ఇదీ చదవండి: బుమ్రా.. కుంబ్లేలా​ బౌలింగ్​ వేస్తే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.