లాక్డౌన్లో సంపాందిచడానికి అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆస్ట్రేలియన్ రేసర్ రేనీ గ్రేసీ. ఇప్పుడు అదే బాటలో ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ ఏంజెలీనా గ్రావోవాక్ చేరింది. టెన్నిస్ రంగంలో సంపాదిస్తున్నా.. తన టెన్నిస్ కెరీర్‌కు మద్దతుగా అదనంగా సంపాందించడానికి ఏంజెలీనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో తన వ్యక్తిగత ఫొటోలను 'ఓన్లీఫ్యాన్స్' వెబ్‌సైట్‌కు అమ్మేసిందని కొన్ని వార్తాసంస్థలు నివేదించాయి. అయితే ఆ వెబ్సైట్ నుంచి ఏంజెలీనా ఎంతమొత్తం ఆర్జించిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
అయితే ఈ వార్తలపై ఆస్ట్రేలియాకు చెందిన ఓ వార్తాసంస్థ ఏంజెలీనా గ్రావోవాక్ను సంప్రదించగా.. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి కొన్ని ఫొటోలను ఆమె తొలగించింది.
ఏంజెలీనా గ్రావోవాక్.. టెన్నిస్‌లో ఇప్పటివరకు 37 సింగిల్స్‌లో ఆడగా.. తొమ్మిదిటిలో విజయం సాధించింది. టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో ఆమె ప్రస్తుతం 1,171 ర్యాంకులో ఉంది.
ఇదీ చూడండి: పోర్న్‌స్టార్‌గా మారిన మహిళా కార్ రేసర్