ETV Bharat / sports

తర్వాత చనిపోయేది నేనేనా?: కోకో గాఫ్​ ఆవేదన - Coco Gauff latest news

అగ్రరాజ్యంలో ఓ పోలీసు కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు నిరసన తెలిపింది యువ టెన్నిస్​ ప్లేయర్​ కోకో గాఫ్​. ఇప్పటివరకు అమెరికాలో చనిపోయిన కొందరి ఫొటోలతో రూపొందించిన ఓ వీడియోను పోస్ట్​ చేసింది. "తర్వాత చనిపోయేది నేనేనా" అని ప్రశ్నించింది.

Young tennis player Coco Gauff
తర్వాత చనిపోయేది నేనేనా?: కోకో గాఫ్​ ఆవేదన
author img

By

Published : May 30, 2020, 9:49 PM IST

అమెరికాలో పోలీసు అధికారి కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై జరుగుతున్న నిరసనలకు పరోక్షంగా మద్దతు పలికింది టెన్నిస్​ ప్లేయర్​ కోకో గాఫ్​. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ వీడియోను పోస్టు చేసింది.

Coco Gauff
కోకో గాఫ్​

"ఈ వేదిక ద్వారా జాతివివక్షపై పోరాడేందుకు గళమెత్తుతున్నా. మరి మీరో?" అంటూ ఇప్పటివరకు చనిపోయిన కొందరి ఫొటోలతో రూపొందించిన వీడియోను అభిమానులతో పంచుకుందీ 16 ఏళ్ల ప్లేయర్​. తర్వాత నేనేనా చనిపోయేది అని ప్రశ్నించింది.

ఇదీ జరిగింది...

ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడపై ఓ పోలీసు మోకాలితో తొక్కిపెట్టడం వల్ల ఊపిరాడక గిజగిజలాడిపోయి చివరకు మరణించాడు. "దయచేసి నా గొంతుపై కాలు తీయండి.. ఊపిరి ఆడట్లేదు. ప్రాణం పోయేలా ఉంది. నన్ను చంపేసేలా ఉన్నారు" అని విలవిలలాడినా ఆ కర్కశ పోలీసు కనికరించలేదు. అమెరికాలోని మినియాపొలిస్‌లో సోమవారం రాత్రి ఈ దుర్మార్గం చోటుచేసుకుంది. ఫలితంగా ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా శనివారం పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆ పోలీసుపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: ఫెదరర్​ టాప్​లో.. కోహ్లీకి 66వ ర్యాంక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.