ETV Bharat / sports

Harbhajan: పాక్​ క్రికెటర్ల గురించి అందరికీ తెలుసు.. భజ్జీ సెటైర్లు - న్యూజిలాండ్

టీమ్​ఇండియాపై ఫిక్సింగ్​ ఆరోపరణలు చేస్తున్న పాకిస్థాన్​ అభిమానులపై విరుచుకుపడ్డాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh News). తాము గెలిస్తే న్యాయంగా ఆడుతున్నామని, ఇతరులు గెలిస్తే అక్రమంగా గెలిచారంటూ చేసే వ్యాఖ్యలు హీనమైనవని అన్నాడు.

T20 World Cup
టీ20 ప్రపంచకప్
author img

By

Published : Nov 6, 2021, 4:07 PM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) సెమీఫైనల్​ చేరేందుకు టీమ్​ఇండియా ఫిక్సింగ్​కు పాల్పడుతోందని పాకిస్థాన్​ అభిమానులు చేస్తున్న ఆరోపణలపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh News) తీవ్రంగా మండిపడ్డాడు. పాక్, న్యూజిలాండ్​ చేతిలో ఓటమిపాలైన తర్వాత అఫ్గానిస్థాన్​పై 66 పరుగుల తేడాతో, స్కాట్లాండ్​పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాలు నమోదు చేసింది భారత జట్టు. అయితే అఫ్గాన్​తో మ్యాచ్​ జరిగినప్పటి నుంచి పాక్​ అభిమానులు ఫిక్సింగ్​ అంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీనిపై స్పందించిన భజ్జీ.. పాక్​ క్రికెటర్ల ఖ్యాతి అందరికీ తెలిసిందేనంటూ చురకలించాడు.

"పాకిస్థాన్​ మంచి క్రికెట్​ ఆడుతోందని అంగీకరిస్తున్నాం. టీమ్​ఇండియాపై బాగా ఆడి గెలిచినందుకు అభినందిస్తున్నాం కూడా. అయితే మీరు న్యాయంగా ఆడుతున్నారని, మేము గెలిచినప్పుడు మాత్రం మాపై అనుమానాలు వ్యక్తం చేసి, 'అక్రమంగా గెలిచారు.. ఫిక్సింగ్​కు పాల్పడ్డారు' అని అనడం తప్పు. మీ క్రికెటర్ల ఖ్యాతి గురించి మా అందరికీ తెలిసిందే"

- హర్భజన్ సింగ్, టీమ్ఇండియా మాజీ స్పిన్నర్

ఆరోపణలు చాలా చీప్​..

టీమ్​ఇండియాకు సహకరించేందుకు అఫ్గాన్​ (India vs Afghanistan) కావాలనే అలా ఆడిందంటూ ఆ దేశంపైనా సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వస్తున్నాయి. ఐపీఎల్​ కాంట్రాక్టుల కోసం అఫ్గాన్​ ఆటగాళ్లు కోహ్లీసేన గెలిచేందుకు సహాయం చేశారని కొందరు ఆరోపించారు. అయితే ఇలాంటి ఆరోపణలతో సమయం వృథా చేసుకోకుండా, టీమ్​ఇండియాపై తమ తొలి గెలుపును ఆస్వాదించాలని భజ్జీ చెప్పాడు.

"టీమ్​ఇండియాపై విజయాన్ని పాకిస్థాన్​ అభిమానులు నమ్మలేకపోతున్నారు. ప్రపంచకప్​లలో ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఈ విజయం దక్కింది. అయితే మాట్లాడటానికి, ప్రశ్నలు లేవనెత్తడానికి ఓ పద్ధతి ఉంటుంది. మాపై, రషీద్ ఖాన్​పై తీవ్రమైన ఆరోపణలు చేయడం చాలా హీనమైన, అవమానకరమైన చర్య." అని హర్భజన్ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: 'సెమీస్ రేసులో ఉత్కంఠ.. అఫ్గాన్-కివీస్​పైనే ఒత్తిడి'

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.