టీ20ల్లో కోహ్లీ శకం ముగిసింది (Kohli News). ప్రపంచకప్‌లో నమీబియా మ్యాచ్.. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి చివరిది. సారథిగా ఇది అతడి 50వ మ్యాచ్ కావడం విశేషం. ఎంఎస్ ధోనీ తర్వాత 2017లో ఇంగ్లాండ్‌పై తొలిసారి పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు విరాట్. మేటి బ్యాటర్‌గా కొనసాగుతున్న అతడు.. కెప్టెన్‌గా (Virat Kohli t20 Stats as Captain) పలు రికార్డులు కైవసం చేసుకున్నాడు. ఇంతకీ అవేంటంటే?
- అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 49 మ్యాచుల్లో (నమీబియాతో మ్యాచ్ మినహా) నాయకత్వం వహించిన కోహ్లీ.. 29 విజయాలను అందించాడు. ఎంఎస్ ధోనీ తర్వాత (42 విజయాలు) తర్వాత అత్యధిక విజయాలు అతడివే.
- అంతర్జాతీయ టీ20ల్లో సేనా దేశాలపై (ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) గెలిచిన ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్ కోహ్లీనే కావడం విశేషం.
- అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసింది కోహ్లీనే. మొత్తం 94 మ్యాచ్‌లు ఆడిన అతడు 52.05 సగటుతో 3227 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో మూడు వేల పరుగులు సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.
- టీ20 ప్రపంచకప్‌లలో రెండుసార్లు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన ఏకైక క్రికెటర్ కూడా అతడే.
- అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక(29) హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే శతకాలు మాత్రం బాదలేదు.
టీ20ల్లో కోహ్లీ విధ్వంసం..
భారత్ నుంచి ఒక్కడే!
టీ20ల్లో పదివేలకుపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు కోహ్లీ. ఈ జాబితాలో క్రిస్‌గేల్(14,276), కీరన్ పొలార్డ్(11,236), షోయబ్ మాలిక్ (11,033), కోహ్లీ(10,204), వార్నర్(10,019). భారత్ తరఫున ఈ ఫీట్‌ను అందుకున్న తొలి ఆటగాడు ఇతడే కావడం విశేషం. ఇప్పటికీ ఈ లిస్ట్‌లో విరాట్ మాత్రమే టీమ్ఇండియా నుంచి ఉన్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (virat kohli t20 world cup runs)
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు కోహ్లీ. 21 మ్యాచ్‌ల్లో 76.81 సగటుతో 845 రన్స్ చేశాడు. ఇందులో 10 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లలో మహేలా జయవర్దనె(1,016), క్రిస్‌గేల్(965), దిల్షన్(897) రన్స్‌తో కొనసాగుతున్నారు.
ఓకే సీజన్లో ఎక్కువ రన్స్..
2014లో ఆరు మ్యాచ్‌ల్లో 106.33 సగటుతో 319 పరుగులు చేసి.. ఒకే సీజన్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు విరాట్. ఈ ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది టీమ్ఇండియా.
ఇదీ చూడండి: T20 world cup: టాస్ గెలిచిన కోహ్లీసేన.. నమీబియా బ్యాటింగ్