టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత జట్టు ఆదివారం న్యూజిలాండ్‌తో (Ind Vs Nz) తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మార్పులు లేకుండా (T20 World Cup 2021 India Squad) బరిలో దిగబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో గాయంతో ఫీల్డింగ్ చేయలేకపోయిన హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్ సాధించడం వల్ల అతడినే కొనసాగించే అవకాశం ఉంది.
పాండ్య స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను (Shardul Thakur News) ఏడో నంబర్ బ్యాటర్‌గా తీసుకుంటారన్న వార్తల వచ్చినా.. ఆ స్థానంలో అతడిని తీసుకోవడం అంత సమంజసం కాదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.. ఇక బౌలింగ్‌లోనూ ఠాకూర్‌కి వికెట్లు తీయగల సత్తా ఉన్నా.. పరుగులు ధారాళంగా ఇస్తుండడం అతడి ఎంపికకు పెద్ద ప్రతికూలత. ఇటీవలే పాండ్య (Hardik Pandya News) నెట్స్‌లో సాధన చేస్తుండడం వల్ల కివీస్‌తో పోరులో అతడు బౌలింగ్ చేసే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.
ఇదీ చూడండి: T20 World Cup: 'గత ఖ్యాతితోనే జట్టులో హార్దిక్, భువీ'