ETV Bharat / sports

IND vs NZ T20: చేతులెత్తేసిన టీమ్​ఇండియా.. కివీస్​ లక్ష్యం 111

న్యూజిలాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా చేతులెత్తేసింది. టాప్​ ఆర్డర్​ సహా మిడిలార్డర్ కూడా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది భారత్.

ind vs nz
భారత్, న్యూజిలాండ్
author img

By

Published : Oct 31, 2021, 9:11 PM IST

ఆదివారం చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్​లో టీమ్​ఇండియా చేతులెత్తేసింది. న్యూజిలాండ్ బౌలర్లు భారత్​పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది టీమ్​ఇండియా. కివీస్​ బౌలర్లలో సోధీ(2), ట్రెంట్ బోల్ట్(2), మిల్నే, సౌథీ చెరో వికెట్ తీశారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు ఆరంభంలోనే తడబడింది. ఇషాన్​ కిషన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా వచ్చినా జట్టుకు శుభారంభం దక్కలేదు. ఇషాన్​(4), కేఎల్​ రాహుల్(18), రోహిత్​ శర్మ(14), విరాట్​ కోహ్లీ(9) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. అనంతరం రిషభ్ పంత్ 12 పరుగుల వద్ద మిల్నే బౌలింగ్​లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

చివరిదశలో హార్దిక్​ పాండ్య(23) పరుగులతో రాణించినా బౌల్ట్​ వేసిన ఓవర్లో ఔటయ్యాడు. జట్టులో అవకాశం దక్కించుకున్న శార్దూల్ ఠాకూర్ ఒక్క పరుగైనా చేయకుండానే పెవిలియన్ చేరాడు. చివర్లో రవీంద్ర జడేజా 26 పరుగులతో రాణించడం వల్ల గౌరవప్రదమైన స్కోరు నమోదైంది

ఇదీ చదవండి:

T20 World Cup: వరుణ్ స్థానంలో అశ్విన్.. నాలుగో ఆటగాడిగా జడ్డూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.