టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లోనూ (Pak Vs Nam) పాకిస్థాన్ అదరగొట్టింది. బ్యాటర్లు, బౌలర్లు మరోసారి అద్భుత ప్రదర్శన చేసిన వేళ వరుసగా నాలుగో విజయం కైవసం చేసుకొని సెమీస్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. పాక్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో నమీబియా తడబడింది. క్రెయిగ్ విలియమ్స్(40) రాణించాడు. దీంతో ఆ జట్టుపై 45 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్ తలో వికెట్.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు (Babar Azam News) బాబర్ అజామ్(70), రిజ్వాన్(79) మరోసారి అదరగొట్టారు. హఫీజ్(32) ఫర్వాలేదనిపించాడు. నమీబియా బౌలర్లలో వైస్, జేన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా గెలుపు.. సెమీస్ అవకాశాలు మెరుగు