టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో తలపడుతోంది అఫ్గానిస్థాన్. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది.
ఆరంభంలోనే హజ్రతుల్లా జజాయ్ (0) వికెట్ కోల్పోయింది అఫ్గాన్. అనంతరం షెహ్జాద్ (8), రెహ్మనుల్లా (10), అస్గర్ అఫ్గాన్ (10), కరీమ్ జనత్ (15) విఫలమయ్యారు. దీంతో 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది అఫ్గాన్. ఆ తర్వాత మిడిలార్డర్లో నజీబుల్లా (22)తో కలిసి కెప్టెన్ నబీ జట్టును ఆదుకున్నాడు. నజీబుల్లా ఔటైనా.. గుల్బదిన్తో కలిసి చివర్లో విలువైన పరుగులు సాధించాడు సారథి. వీరిద్దరూ పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. చివరి వరకు పోరాడి మహమ్మద్ నబీ (35), గుల్బదిన్ నైబ్ (35) నాటౌట్‌గా నిలిచారు.