ETV Bharat / sports

T20 World Cup: వరుణ్ స్థానంలో అశ్విన్.. నాలుగో ఆటగాడిగా జడ్డూ! - సంజయ్ బంగర్ న్యూస్ టుడే

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా న్యూజిలాండ్​తో పోరుకు సిద్ధమైంది టీమ్​ఇండియా(IND vs NZ T20). ఈ నేపథ్యంలో కోహ్లీ సేన.. తుది జట్టులో మార్పులతో బరిలోకి దిగుతుందని మాజీలు చెబుతున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో అశ్విన్​కు(R Ashwin News) చోటు లభించే అవకాశముందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. కాగా, నాలుగో స్థానంలో రవీంద్ర జడేజాను ఆడించాలని బంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి సూచించాడు.

ashwin, jadeja
అశ్విన్, జడేజా
author img

By

Published : Oct 31, 2021, 4:27 PM IST

టీమ్‌ఇండియా మరికొద్దిసేపట్లో న్యూజిలాండ్‌తో(IND vs NZ T20) తలపడే కీలకపోరులో యువస్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి బదులు సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు(R Ashwin News) అవకాశం ఇవ్వొచ్చని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌(Sanjay Bangar News) అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు పాకిస్థాన్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లో వరుణ్‌ విఫలమయ్యాడు. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు పాకిస్థాన్‌తోనూ ఓటమిపాలవ్వడం వల్ల ఈ మ్యాచ్‌ రెండు జట్లకూ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత జట్టు అనుభవం లేని వరుణ్‌ కన్నా అశ్విన్‌కే చోటిచ్చే అవకాశం ఉందని సంజయ్‌ వివరించాడు.

యూఏఈలో ఇటీవల వరుణ్‌ ప్రదర్శన ఏమంత ఆకట్టుకునేలా లేదని, అతడు షార్జాలో ప్రభావం చూపినంత దుబాయ్‌లో చూపలేకపోతున్నాడని బంగర్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఇది టీమ్‌ఇండియాకు చావోరేవో లాంటి మ్యాచ్‌ అయిన నేపథ్యంలో కచ్చితంగా సీనియర్‌ స్పిన్నర్‌కే అవకాశం దక్కొచ్చనే నమ్మకం ఉంచాడు.

కాగా, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా(IND vs PAK T20) బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా సాధించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే భువనేశ్వర్‌కుమార్‌ను తొలగించి శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కచ్చితంగా మార్పులతోనే బరిలోకి దిగేలా కనిపిస్తోంది.

నాలుగో స్థానంలో జడ్డూ..

టీమ్‌ఇండియా నాలుగోస్థానంలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను(Jadeja News) ఆడించాలని బంగాల్‌ క్రికెటర్‌ మనోజ్‌ తివారి అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన అతడు టీమ్‌ఇండియా ఆటతీరుపై స్పందించాడు. ఈ క్రమంలోనే పాక్‌తో ఓటమి, తిరిగి పుంజుకునే విషయాలపై తన ఆలోచనలు పంచుకున్నాడు. కోహ్లీసేన బ్యాటింగ్‌ ఆర్డర్‌(team india batting order) పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, టాప్‌ఆర్డర్‌ వైఫల్యమే దాయాదుల పోరులో ఓటమికి కారణమైందని వెల్లడించాడు.

అలాగే టాప్‌ఆర్డర్‌లో నలుగురు ఆటగాళ్లు కుడిచేతివాటం గల బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని, అలా కాకుండా నాలుగో స్థానంలో ఎడమచేతి వాటంగల జడేజాను పంపించాలన్నాడు. అలా చేస్తే బౌలర్లకు ఇబ్బందిగా మారి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయలేరని చెప్పాడు. అయితే, ఆ స్థానంలో టీమ్‌ఇండియా.. సూర్యకుమార్‌ లేదా రిషభ్‌పంత్‌ను పంపుతోందని పేర్కొన్నాడు. కానీ, జడేజా ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడన్నాడు. అతడు స్రైక్‌ రొటేట్‌ చేస్తూ బౌండరీలు బాదుతూ పరుగులు సాధిస్తాడన్నాడు. అతడిని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపే ప్రయత్నం చేయాలన్నాడు. టీమ్‌ఇండియా మంచి అనుభవం కలిగిన జట్టని, ఇకపై ఆడే ప్రతి గేమ్‌ మంచి రన్‌రేట్‌తో గెలవాలని కోరాడు. న్యూజిలాండ్‌తో పోరులో కోహ్లీ సేన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:

T20 World Cup: 'ఈ మార్పులు చేస్తే టీమ్​ఇండియాదే విజయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.