టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) తుదిదశకు చేరుకుంది. టీమ్ఇండియా సెమీఫైనల్ చేరకుండానే ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఇక సోమవారం(నవంబర్ 8) నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో కోహ్లీసేన.. నమీబియా(ind vs nam t20)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడైన రాహుల్ చాహర్(rahul chahar t20 world cup)ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ తుది జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో.. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క రాహుల్ చాహర్ తప్ప మిగతా వారంతా కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడారు. దీంతో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో రాహుల్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(aakash chopra t20 team) పేర్కొన్నాడు.
"సోమవారం నమీబియా(ind vs nam t20)తో జరుగనున్న మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో మార్పులు చేస్తే కచ్చితంగా రాహుల్ చాహర్(rahul chahar t20 world cup)కు అవకాశమిస్తారు. అయితే, ఎవరిని పక్కన పెట్టాలనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో కీలకంగా ఉన్నాడు. ఇటు బంతితోనూ, అటు బ్యాటుతోనూ నిలకడగా రాణిస్తున్నాడు. చాలా కాలం తర్వాత పొట్టి ఫార్మాట్లో స్థానం దక్కించుకున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. కాబట్టి, వీరిద్దరిని పక్కన పెట్టే అవకాశం లేదు. ఇక, జట్టులోకి కొత్తగా వచ్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కాబట్టి, అతడి స్థానంలో రాహుల్ చాహల్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది" అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
అలాగే, ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లను అలాగే కొనసాగిస్తూ.. హార్దిక్ పాండ్యా స్థానంలో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు మరో అవకాశం ఇవ్వొచ్చని ఆకాశ్(aakash chopra t20 team) అభిప్రాయపడ్డాడు.