అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC).. టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'ను ప్రకటించింది. ఇందులో భారత క్రికెటర్(Team India News) ఒక్కరు కూడా స్థానం సంపాదించలేదు. పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్ కెప్టెన్‌గా ఉన్న ఈ ఐసీసీ జట్టులో.. సెమీస్ చేరని శ్రీలంక, దక్షిణాఫ్రికాకు కూడా ప్రాతినిధ్యం లభించింది.
అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలపై ఘన విజయాలకు ముందు పాక్, న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిన టీమ్ఇండియా.. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే భారత జట్టులోని ఏ ఒక్క క్రికెటర్‌కు ఐసీసీ జట్టులో (Team of The Tournament) స్థానం పొందే అర్హత లేదని భావించిన జ్యూరీ సభ్యులు.. నాకౌట్ చేరుకుండానే వైదొలిగిన దక్షిణాఫ్రికా నుంచి ఎయిడెన్ మార్క్రమ్, నోర్జే.. శ్రీలంక నుంచి అసలంక, హసరంగను ఎంపిక చేశారు.
ఆస్ట్రేలియా నుంచి జట్టుకు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను అందించి ఓపెనర్, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' డేవిడ్ వార్నర్ (David Warner News), సీమర్ హేజిల్‌వుడ్, స్పిన్నర్ ఆడమ్ జంపాకు ఐసీసీ జట్టులో స్థానం లభించింది. ఇంగ్లాండ్ నుంచి వికెట్ కీపర్ జోస్ బట్లర్, కివీస్ బౌలర్ బౌల్ట్‌ను, కెప్టెన్‌గా పాక్ స్టార్ బాబర్‌ను (Babar Azam News) ఎంపిక చేశారు.
ఐసీసీ జట్టు (ICC Team of The Tournament):
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
జోస్ బట్లర్ (వికెట్ కీపర్) (ఇంగ్లాండ్)
బాబర్ అజామ్, (కెప్టెన్, పాకిస్థాన్)
చరిత్ అసలంక (శ్రీలంక)
ఎయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా)
మొయిన్ అలీ (ఇంగ్లాండ్)
వనిందు హసరంగ (శ్రీలంక)
ఆడం జంపా (ఆస్ట్రేలియా)
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)
అన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా)
12వ ఆటగాడు: షహీన్ అఫ్రిదీ (పాకిస్థాన్)
టీ20 ప్రపంచకప్ 2021 ఘనతలు..
కొద్దిరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ వచ్చిన టీ20 ప్రపంచకప్ టోర్నీ (T20 World Cup 2021) ఆదివారంతో(నవంబరు 14) ముగిసింది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో మెరిసిన కంగారూలు.. టోర్నీ ఛాంపియన్‌గా (T20 World Cup Winners) నిలిచారు. బౌండరీలు బాదుతూ లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకోగా , డేవిడ్ వార్నర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు దక్కింది.
మొత్తంగా ఆసక్తిగా సాగిన ఈ మెగాటోర్నీలో(T20 World Cup 2021) పలువురు ఆటగాళ్లు పలు ఘనతలు నమోదుచేశారు. వాటి సమాహారమే ఈ కథనం(T20 World Cup Records List)..
అత్యధిక పరుగులు
- బాబర్ అజామ్ (పాకిస్థాన్) - 6 మ్యాచుల్లో 303 పరుగులు
- డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 7 మ్యాచుల్లో 289 పరుగులు
అత్యధిక సగటు
- జాస్ బట్లర్ (ఇంగ్లాండ్) - 6 ఇన్నింగ్స్‌లో 89.67- 3 నాటౌట్లు
- మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా) - 4 ఇన్నింగ్స్‌లో 80- 3 నాటౌట్లు
అత్యధిక వ్యక్తిగత స్కోరు
- జాస్ బట్లర్ (ఇంగ్లాండ్)-101
అత్యధిక స్ట్రైక్ రేట్
- ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 400 ( ఒక్క ఇన్నింగ్స్‌లో)
- అసిఫ్ అలీ (పాకిస్థాన్) - 237.50 (4 ఇన్నింగ్స్)
అత్యధిక హాఫ్ సెంచరీలు
- బాబర్ అజామ్ (పాకిస్థాన్)-4
అత్యధిక సిక్సులు
- జాస్ బట్లర్ (ఇంగ్లాండ్)-13
అత్యధిక ఫోర్లు
- డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 32
అత్యధిక వికెట్లు
- వానిందు హసరంగ(శ్రీలంక) - 8 మ్యాచుల్లో 16 వికెట్లు (క్వాలిఫైయర్లతో సహా)
- అడమ్ జంపా (ఆస్ట్రేలియా)- 7 మ్యాచుల్లో 13 వికెట్లు (నాకౌట్ మ్యాచులతో కలిపి)
బెస్ట్ యావరేజ్
- పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 5
ఐదు వికెట్లు ప్రదర్శన
- అడమ్ జంపా (ఆస్ట్రేలియా) - 1
- ముజీబ్ జద్రాన్ (ఆస్ట్రేలియా)- 1
ఇదీ చూడండి: వార్నర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'.. షోయబ్ అసంతృప్తి