టీమ్ఇండియా పాలిట(India vs New Zealand) న్యూజిలాండ్ శాపంలా మారింది! గత రెండేళ్లలో వన్డే, టెస్టు, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఐసీసీ ట్రోఫీలను దక్కించుకోవాలనే కలకు గండికొట్టింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో (2019 World Cup) కివీస్ వల్ల ఫైనల్ చేరలేకపోయిన భారత్.. 2021లో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో (2021 WTC Final) న్యూజిలాండ్ చేతిలోనే ఓడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లోనూ (T20 World Cup 2021) కివీస్ వల్లే సెమీస్ చేరలేకపోయింది. దీంతో సగటు అభిమాని.. టీమ్ఇండియాకు కివీస్ గండం పట్టుకుందని ఆవేదన చెందుతున్నాడు.
2019 వన్డే ప్రపంచకప్..
2019 వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో గ్రూప్ టాపర్‌గా నిలిచి సెమీస్ చేరిన టీమ్ఇండియా.. 18 పరుగుల తేడాతో కివీస్ చేతిలో (2019 World Cup Ind vs NZ) ఓడింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు దారుణంగా విఫలం కాగా.. రవీంద్ర జడేజా (77), ధోనీ (50) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వారి నిష్క్రమణతో ఆ ప్రపంచకప్ ఆశలు ముగిశాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ..
ఈ ఏడాది జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో (India vs New Zealand WTC Final) టీమ్ఇండియాపై 8 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది కివీస్. చివరి రోజు 53 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉండగా.. మరో 7 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టెస్టుల్లో తొలి ఐసీసీ ట్రోఫీ ముద్దాడాలనే భారత్ లక్ష్యానికి కివీస్ అడ్డుకట్ట వేసింది.
టీ20ల్లోనూ నిరాశే..
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని చివరి టీ20 ప్రపంచకప్‌లోనైనా (Ind vs NZ T20 World Cup 2021) కప్పు గెలవాలనే టీమ్ఇండియా కలను మళ్లీ కివీస్ జట్టే దూరం చేసింది. లీగ్ మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాను ఓడించిన న్యూజిలాండ్.. భారత్ సెమీస్ చేరడానికి ఉన్న ఏకైక అవకాశాన్ని చెరిపేసింది. అదే అఫ్గాన్‌తో మ్యాచ్. ఆ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచి కోహ్లీసేనకు నిరాశ మిగిల్చింది.
2007లో టీ20 ప్రపంచకప్ కొట్టిన టీమ్ఇండియా.. 2009, 2010, 2012లో సూపర్ 8 వరకూ వెళ్లింది. 2014లో రన్నరప్‌గా నిలిచింది. 2016లో సెమీస్ వరకు చేరుకోగలిగింది. కానీ ఇప్పుడు సూపర్ 12తోనే సరిపెట్టుకుంది. 2012 తర్వాత.. మన పురుషుల క్రికెట్ జట్టు.. వన్డే, టీ 20 ప్రపంచకప్ సెమీస్ చేరకపోవడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి: అఫ్గాన్‌పై న్యూజిలాండ్ విజయం.. ఇండియా ఇంటికి