ETV Bharat / sports

ఐసీయూ నుంచి వచ్చి హాఫ్ సెంచరీ.. రిజ్వాన్​పై ప్రశంసలు - మహ్మద్ రిజ్వాన్ ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో భాగంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది పాకిస్థాన్(aus vs pak t20). అయితే ఈ మ్యాచ్​కు ముందు అనారోగ్యానికి గురై ఐసీయూలో చికిత్స పొందిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(mohammad rizwan news)​ సాధించిన అర్ధసెంచరీ చూసి అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Rizwan
రిజ్వాన్​
author img

By

Published : Nov 12, 2021, 10:09 AM IST

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైంది పాకిస్థాన్(pak vs aus t20). దీంతో టోర్నీలో ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. అయితే ఈ మ్యాచ్​లో అర్ధశతకంతో పాక్​ను ఆదుకున్న ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(mohammad rizwan news)​.. ఈ మ్యాచ్​కు ముందు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్​తో ఆస్పత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందాడు. దీంతో ఇతడు ఆసీస్​తో పోరులో బరిలో దిగుతాడో? లేదో? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాచ్​కు ముందే అతడు కోలుకున్నట్లు ప్రకటన చేసింది పీసీబీ. అనంతరం బ్యాటింగ్​లో అదరగొట్టాడు రిజ్వాన్(mohammad rizwan news)​ . మ్యాచ్ అనంతరం పాక్ ఓడిపోయాక.. రిజ్వాన్ ఐసీయూలో ఉన్న ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే విషయంపై స్పందించిన పాక్ బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హెడెన్.. రిజ్వాన్​పై ప్రశంసల జల్లు కురిపించాడు.

"ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్​తో సెమీస్ ముందు ఆస్పత్రిలో చికిత్స పొందాడు రిజ్వాన్. అతడో యోధుడు. అద్వితీయ పోరాటపటిమతో ఈ టోర్నీలో కీలకంగా వ్యవహరించాడు" అంటూ రిజ్వాన్​కు కితాబిచ్చాడు హెడెన్.

మూడో అర్ధసెంచరీ

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్​కు ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్(mohammad rizwan news)​ అద్భుత ఆరంభాన్నిచ్చారు. బాబర్ 39 పరుగులు చేసి ఔటైనా.. రిజ్వాన్ మాత్రం ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేసి పాక్​ భారీ స్కోర్ చేయడంలో సాయం చేశాడు. ఈ టోర్నీలో ఇది ఇతడికిది మూడో హాఫ్ సెంచరీ. అనంతరం పాక్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించింది ఆసీస్. మాథ్యూ వేడ్ 17 బంతుల్లో 41 పరుగులతో విధ్వంసం సృష్టించి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇవీ చూడండి: టీ20 ప్రపంచకప్ ఫైనల్​కు ముందు కివీస్​కు షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.