టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది టీమ్ఇండియా. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్కాట్లాండ్తో (India vs Scotland) శుక్రవారం తలపడుతోంది. ఈ నేపథ్యంలో తొలుత టాస్ గెలిచిన టీమ్ఇండియా.. స్కాట్లాండ్ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) పాకిస్థాన్, న్యూజిలాండ్ (Ind vs Nz) చేతిలో ఓటమి చవిచూసిన భారత్... అఫ్గానిస్థాన్‌ను (Ind Vs Afg) 66పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సెమీస్‌కు చేరడం తమ చేతిలో లేకపోయినా.. సాంకేతికంగా ఇంకా సెమీస్ ఆశలు సజీవంగా ఉండటం వల్ల స్కాట్లాండ్, నమీబియాపై భారీ విజయాలు నమోదు చేయాలని కోహ్లీసేన భావిస్తోంది.
జట్లు:
టీమ్ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. శార్దుల్ ఠాకూర్‌ను తప్పించి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి జట్టులో చోటు కల్పించారు.
టీమ్ఇండియా:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా.
స్కాట్లాండ్:
జార్జ్ మున్సీ, కైలీ కోట్జర్, మ్యాథ్యూ క్రాస్, రిచీ బెరింగ్టన్, మెక్లియోడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, షరీఫ్, ఎవన్స్, బ్రాడ్లీ వీల్.
ఇదీ చూడండి: నమీబియాపై కివీస్ ఘన విజయం- సెమీస్ రేసులో ముందడుగు