టీ20 ప్రపంచకప్(t20 word cup news)లో టీమ్‌ఇండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలంది. దీంతో సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన కీలకపోరులో విఫలమైన కోహ్లీసేన ఐసీసీ టోర్నీల్లో మరోసారి న్యూజిలాండ్ చేతి(ind vs nz t20)లో భంగపాటుకు గురైంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన భారత టాపార్డర్ ఈ టోర్నీలో పూర్తిగా విఫలమైంది. పాకిస్థాన్‌పై అర్ధశతకంతో ఆదుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ(virat kohli news) కూడా కివీస్‌తో పోరులో విఫలమయ్యాడు. రవీంద్ర జడేజా (26*), హార్దిక్ పాండ్యా (23) చివర్లో ధాటిగా ఆడలేక సతమతమయ్యారు. చివరికి 110/7 స్కోర్ సాధించి ఆలౌట్ కాకుండా మాత్రం చూసుకున్నారు. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ మొత్తం ఒకరి తర్వాత ఒకరు ఎలా పెవిలియన్ చేరారో మీరే చూడండి(ind vs nz highlights).
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది భారత్(ind vs pak t20). ఇక రెండో మ్యాచ్‌లో కివీస్.. టీమ్ఇండియాను మట్టికరిపించింది. ఈ టోర్నీలో బుధవారం అఫ్గాన్‌నిస్థాన్(ind vs afg t20)తో తర్వాత పోరులో తలడనుంది. అనంతరం నవంబర్ 5న స్కాట్లాండ్, 8న నమీబియాతో అమీతుమీ తేల్చుకోనుంది.