టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో రెండు వరుస పరాజయాలతో అభిమానుల్ని తీవ్రంగా నిరాశపర్చింది టీమ్ఇండియా. తద్వారా సెమీస్ బెర్తు రేసులో వెనకబడింది. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 3) అఫ్గానిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది కోహ్లీసేన(ind vs afg t20). ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే భారత జట్టుకు కొంత ఊరట లభిస్తుంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆటగాళ్లు. వారెవరో చూద్దాం.
హెడ్ టు హెడ్
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)ల్లో ఇప్పటివరకు రెండుసార్లు తలపడ్డాయి భారత్-అఫ్గానిస్థాన్(ind vs afg 2021). రెండుసార్లూ టీమ్ఇండియా విజయం సాధించింది.
రికార్డులు
- విరాట్ కోహ్లీ(virat kohli records) మరో 9 సిక్సులు బాదితే టీ20ల్లో రోహిత్ తర్వాత 100 సిక్సులు సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలుస్తాడు,
- ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సులు బాదితే అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు హార్దిక్ పాండ్యా(hardik pandya sixes).
- మరొక వికెట్ సాధిస్తే టీ20ల్లో 400 వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డు సాధిస్తాడు అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(rashid khan wickets).
- మరో 27 పరుగులు సాధిస్తే టీ20 క్రికెట్లో 2000 పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు అఫ్గాన్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్.
- మరో 7 పరుగులు సాధిస్తే టీ20ల్లో 2000 పరుగుల క్లబ్లో చేరిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పుతాడు మహ్మద్ షెహ్జాద్.
- మరో 4 సిక్సులు బాదితే టీ20 క్రికెట్లో 250 సిక్సులు బాదిన బ్యాటర్ల జాబితాలో చేరతాడు అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ. అలాగే మరో 26 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్లో 1500 పరుగులు పూర్తి చేసుకుంటాడు.
- మరో 11 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 5,500 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు కేఎల్ రాహుల్(kl rahul news).
- ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధిస్తే టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన కెప్టెన్ల జాబితాలో బాబర్ అజామ్ సరసన నిలుస్తాడు కోహ్లీ(virat kohli half centuries in t20 as captain). ప్రస్తుతం 44 ఇన్నింగ్స్‌ల్లో 13 హాఫ్ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా.. 27 ఇన్నింగ్స్‌ల్లో 14 అర్ధశతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు బాబర్ అజామ్.
- మరో 40 పరుగులు చేస్తే కోహ్లీ తర్వాత టీ20ల్లో 9,500 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా నిలుస్తాడు రోహిత్ శర్మ(rohit sharma t20 runs).