ETV Bharat / sports

T20 World Cup: అఫ్గాన్​పైనే టీమ్​ఇండియా ఆశలు.. సెమీస్​ చేరే జట్లు ఇవే!

టీ20 ప్రపంచకప్​లో గ్రూప్​ దశ మ్యాచ్​లు ముగింపునకు చేరుకున్నాయి. శనివారంతో(నవంబరు 6) గ్రూప్​ 1లో సెమీస్​ చేరే జట్లపై స్పష్టత వచ్చేసింది. అయితే గ్రూప్​ 2లో మాత్రం అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్​ మధ్య పోటీ నెలకొనగా.. టీమ్​ఇండియా భవితవ్యం అఫ్గాన్​పై ఆధారపడి ఉంది. ఇంతకీ గ్రూప్-1లో ఏ జట్లు సెమీస్​కు చేరాయి, గ్రూప్​-2లో ఏ టీమ్స్​కు అవకాశాలు ఉన్నాయి? వాటికి బెర్తు దక్కాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం..

T20 World Cup
టీ20 ప్రపంచకప్​
author img

By

Published : Nov 7, 2021, 7:35 AM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) భాగంగా శుక్రవారం(నవంబరు​ 5) జరిగిన మ్యాచ్​లో గంటలోపే స్కాట్లాండ్​ను (Ind vs Scotland) చిత్తుచేసి సెమీస్​ ఆశలను నిలబెట్టుకుంది టీమ్​ఇండియా. పూర్తి మ్యాచ్​(రెండు ఇన్నింగ్స్ కలిపి) 24.1 ఓవర్లలోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్​లో 17.4 ఓవర్లలో స్కాట్లాండ్​ను 85 పరుగులకే కట్టడి చేసి, అనంతరం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది భారత్. దీంతో నెట్​రన్​రేట్​ను అమాంతం +1.619కు పెంచుకుంది. అది టేబుల్​ టాపర్​ పాకిస్థాన్​ (+1.065) సహా గ్రూప్​లోని అన్ని జట్ల కన్నా మెరుగైనది. అయినా టీమ్​ఇండియా సెమీస్​ (Semi Final World Cup 2021) చేరడం ఇప్పుడు దాని చేతుల్లో లేదు. ఈ నేపథ్యంలో భారత్​ సహా మిగతా జట్లు సెమీస్​కు చేరాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

టీమ్​ఇండియా..

టోర్నీ ఆరంభంలోనే (Ind vs Pak) పాక్, న్యూజిలాండ్ (Ind vs NZ)​ రూపంలో టీమ్​ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగిన జట్టు.. సెమీస్​ చేరితే చాలు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక రేసులో నిలవాలంటే నెట్​రన్​రేట్​ పెంచుకోవాల్సిన కీలక దశలో అఫ్గాన్​, స్కాట్లాండ్​పై భారీ విజయాలు సాధించింది కోహ్లీసేన. ఇక భారత్​ ఆశలన్నీ ఆదివారం జరగనున్న కివీస్​, అఫ్గాన్ (NZ vs Afg)​ మధ్య జరగనున్న మ్యాచ్​పైనే. కివీస్‌ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ముందంజ వేస్తుంది. భారత్‌ కథ ముగుస్తుంది. నమీబియాతో చివరి మ్యాచ్‌ నామమాత్రమవుతుంది. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో గెలిచినా భారత్‌ ఖాతాలో ఆరు పాయింట్లే (మూడు విజయాలు) ఉంటాయి. ఒకవేళ అఫ్గానిస్థాన్‌ సంచలనం సృష్టిస్తే భారత్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ముందంజ వేయాలంటే చివరి మ్యాచ్‌లో సోమవారం నమీబియాపై భారీ తేడాతో గెలవాల్సివుంటుంది.

పాకిస్థాన్​

ఈ ప్రపంచకప్​లో అత్యుత్తమంగా ఆడుతున్న జట్టు పాక్​. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఆ జట్టు ఇప్పటికే సెమీస్​కు చేరింది.

అఫ్గానిస్థాన్​..

అఫ్గాన్​ సెమీస్​ చేరాలంటే.. మెరుగైన రన్​రేట్​ వచ్చేలా న్యూజిలాండ్​ను (Afghanistan vs New Zealand) ఓడించాలి. ఇక నమీబియా.. టీమ్​ఇండియాతో జరిగే మ్యాచ్​లో మంచి ప్రదర్శన చేసి భారత జట్టు రన్​రేట్​ పెరగకుండా చూసుకోవాలి.

కివీస్​..

గ్రూప్​ 2లో సెమీస్​కు పాక్​ తర్వాత ఎక్కువ అవకాశాలున్నది న్యూజిలాండ్​కే. సెమీస్​ చేరాలంటే అఫ్గాన్​ను (NZ vs Afg)​ ఓడిస్తే సరిపోతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. నెట్​రన్​రేట్​లో వెనకబడి ఉన్న కారణంగా సెమీస్​ అవకాశాలు చేజారుతాయి.

గ్రూప్​ 1లో ఇలా..

గ్రూప్​-1లో ఇప్పటికే ఇంగ్లాండ్​ సెమీస్​కు అర్హత సాధించింది. శనివారం(నవంబరు 6) వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో గెలిచి 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కూడా సెమీస్​ బెర్తు ఖరారు చేసుకుంది. కాగా, నవంబరు 6న జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై విజయం సాధించినా కూడా సెమీస్​ అవకాశాలను కోల్పోయింది దక్షిణాఫ్రికా.

ఇవీ చూడండి:

'సెమీస్ రేసులో ఉత్కంఠ.. అఫ్గాన్-కివీస్​పైనే ఒత్తిడి'

ఆదివారం ఏం జరుగుతుందో చూద్దాం: కోహ్లీ

'ట్రోఫీ గెలవకపోతే.. ఎన్ని సెంచరీలు చేసినా వృథానే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.