టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సూపర్ 12 గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ (8) సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం నాలుగేసి మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో దక్షిణాఫ్రికా (6), ఆస్ట్రేలియా (6) పోటీ పడుతున్నాయి. ఉత్తమ రన్‌రేట్‌తో ఆసీస్ రెండో స్థానానికి చేరుకుంది. తమ ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తలపడతాయి. ఒక్క విజయం లేకుండానే బంగ్లాదేశ్ (0) టోర్నీ నుంచి నిష్ర్రమించింది.
దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా (5/19) దెబ్బకు బంగ్లా హడలెత్తిపోయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్ల నష్టపోకుండా 6.2 ఓవర్లలో ఛేదించి విజయం సాధించింది. దీంతో రన్‌రేట్‌ను పెంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (40), డేవిడ్ వార్నర్ (18) విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఇవీ చదవండి: