ETV Bharat / sports

షూటింగ్​ ప్రపంచకప్​: యశస్విని దేశ్‌వాల్​కు స్వర్ణం - భారత షూటర్లు

ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల10 మీటర్ల ఏయిర్ పిస్టల్‌ విభాగంలో యశస్విని సింగ్ దేశ్‌వాల్ స్వర్ణపతకం గెలుపొందింది. షూటర్ మను బాకర్‌ రజతం సాధించింది.

Yashaswini Deswal wins first gold for India, Manu Bhaker clinches silver
షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ యశస్విని సింగ్ దేశ్‌వాల్​కు స్వర్ణం
author img

By

Published : Mar 20, 2021, 7:13 PM IST

దిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల10 మీటర్ల ఏయిర్ పిస్టల్‌ విభాగంలో యశస్విని సింగ్ దేశ్‌వాల్ స్వర్ణపతకం సాధించింది.

ఇదే విభాగంలో భారత్‌కే చెందిన మరో షూటర్ మను బాకర్‌ రజతం సాధించింది. 8 మంది అర్హత సాధించిన ఫైనల్‌ మ్యాచ్‌లో దేశ్‌వాల్‌ 238.8 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకోగా.. 236.7 పాయింట్లు సాధించిన మను బాకర్‌ రజతం గెలుపొందారు. బెలారస్‌కు చెందిన విక్టోరియా చాయ్‌కా కాస్యం సాధించింది.

ఇదీ చదవండి: ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్ నుంచి సింధు ఔట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.