ETV Bharat / sports

పాపులర్​ సాంగ్​కు భారత రెజ్లర్ భలే డ్యాన్స్ - భారత రెజ్లర్ భజరంగ్ పునియా డ్యాన్స్

భారత రెజ్లర్ భజరంగ్ పునియా నృత్యంతో అలరించాడు. ఆ వీడియోను ట్వీట్ చేసింది యునైటెడ్​ వరల్డ్ రెజ్లింగ్.

పాపులర్​ సాంగ్​కు భారత రెజ్లర్ భలే డ్యాన్స్
భారత రెజ్లర్ భజరంగ్ పునియా
author img

By

Published : Apr 27, 2020, 9:42 PM IST

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు పలువురు ఆటగాళ్లు. ఈ ఖాళీ సమయంలో తమకిష్టమైన వ్యాపకాలతో గడుపుతున్నారు. తమలో ప్రతిభను బయటపెడుతున్నారు. ఇదే తరహాలో ఓ హరియాణా పాటకు డ్యాన్స్​ చేశాడు భారత రెజ్లర్ భజరంగ్ పునియా. ఈ వీడియోను యునైటెడ్​ వరల్డ్ రెజ్లింగ్ ట్వీట్ చేసింది.

కరోనా కట్టడిలో భాగంగా జరుగుతున్న పోరాటానికి ఇప్పటికే తన ఆరు నెలల జీతం విరాళంగా ప్రకటించాడు భజరంగ్. 2019లో రెజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో కాంస్యం సాధించిన ఇతడు.. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. అయితే ఈ వైరస్​ ప్రభావంతో మెగా క్రీడలన్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.