ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​ విజేతగా ఇగా స్వైటెక్‌.. తొలి క్రీడాకారిణిగా రికార్డు

వరుస విజయాలతో ఫుల్​ ఫామ్​లో ఉన్న ఇగా స్వైటెక్‌ ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీ విజేతగా అవతరించింది. ఈ ట్రోఫీని ముద్దాడిన తొలి పోలెండ్​ మహిళగా రికార్డుకెక్కింది.

Iga Swiatek us open
ఇగా స్వైటెక్‌
author img

By

Published : Sep 11, 2022, 10:06 AM IST

Updated : Sep 11, 2022, 10:40 AM IST

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీ టైటిల్​ పోరులో ఇగా స్వైటెక్‌ అదరగొట్టింది. అంచనాలకు తగ్గట్టుగా ఆడిన ఈ పోలెండ్‌‌‌‌ స్టార్​‌‌‌ ప్లేయర్‌ ఫైనల్​లో ప్రత్యర్థిని చిత్తు చేసి తన లక్ష్యాన్ని సాధించింది. 6-2,7-6(5) తేడాతో ట్యునీషియా అమ్మాయి ఐదో సీడ్‌ ఆన్స్​ జాబెర్​ను ఓడించి మరోసారి తన సత్తా చాటింది. యూఎస్​ ఓపెన్​లో ఇదే ఆమెకు తొలి టైటిల్​. అలానే ఈ ట్రోఫీని ముద్దాడిన తొలి పోలెండ్​ ​క్రీడాకారిణిగానూ రికార్డు సృష్టించింది. దీంతో స్వైటెక్‌ తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించినట్లైంది. ఆమె 2020, 2022లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లను గెలుచుకొంది. తాజా విజయంతో ఆమె ప్రపంచ నం.1 ర్యాంక్‌ను మరింత బలోపేతం చేసుకుంది.

  • గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌కు మద్దతుగా స్వైటెక్‌ తన టోపీపై ప్రత్యేకమైన రిబ్బన్‌ ధరించి బరిలోకి దిగింది. ఆమె గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ విధంగా చేస్తోంది.
  • ఈ టైటిల్‌ సాధించిన తొలి పోలెండ్‌ క్రీడాకారిణిగా స్వైటెక్‌ ఘనతను సాధించింది.
  • ఈ ఏడాది ఆమె మూడు సార్లు గ్రాండ్‌ స్లామ్‌ సెమీస్‌కు చేరగా రెండు సార్లు టైటిళ్లను సాధించింది. సెమీస్‌కు చేరిన వాటిల్లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలు ఉన్నాయి.
  • ఒక టాప్‌ సీడెడ్‌ క్రీడాకారిణి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలవడం 8 ఏళ్ల తర్వాత ఇదే. 2014లో సెరీనా విలియమ్స్‌ టాప్‌సీడెడ్‌ క్రీడాకారిణిగా బరిలోకి దిగి ఈ టైటిల్‌ను అందుకొన్నారు.
  • ఈ సీజన్‌లో ఆమె ఒక దశలో వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడలేదు. వింబుల్డన్‌ మూడో రౌండ్‌లో ఈ జైత్రయాత్రకు అడ్డుకట్టపడింది.
  • హార్డ్‌కోర్ట్‌ టోర్నీల్లో స్వైటెక్‌ ఆటతీరు చాలా బలంగా ఉంటుంది. ఈ రకం కోర్టులపై నాలుగు డ్ల్యూటీఏ1000 టైటిళ్లలో విజయం సాధించి సన్‌షైన్‌ డబుల్‌ను సాధించిన 4వ క్రీడాకారిణిగా నిలిచింది.

ఇదీ చూడండి: యూఎస్ ఓపెన్‌ ఫైనల్లో అల్కరాజ్‌, రూడ్‌.. గెలిచిన వారిదే అగ్రస్థానం

Last Updated : Sep 11, 2022, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.