భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గాయం నుంచి కోలుకుని సత్తాచాటుతోంది. వెన్నునొప్పి కారణంగా గతేడాది దాదాపు ఆర్నెళ్లు ఆటకు దూరంగా ఉన్న ఆమె.. కోలుకున్నాక వరుస పతకాలు సాధిస్తోంది. శుక్రవారం జరిగిన 6వ ఖతర్ ఇంటర్నేషనల్ కప్ పోటీల్లో స్వర్ణం కైవసం చేసుకుంది. మహిళల 49 కేజీల విభాగంలో పాల్గొన్న ఈ క్రీడాకారిణి.. భారత్‌కు తొలి పతకం తెచ్చింది.
![world champion weightlifter Mirabai Chanu wins gold at Qatar International Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5437186_meera10.jpg)
ఒలింపిక్స్ అర్హత పోటీల్లో పసిడి...
ఆర్నెళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్ వేదికగా జరిగిన ఈజీఏటీ కప్ మహిళల 49 కేజీల విభాగంలో.. 192 కిలోల బరువెత్తిన చాను రికార్డు సృష్టించింది. ఇందులో టాప్‌లో నిలిచి పసిడి సొంతం చేసుకుంది. ఈ పోటీలు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ కావడం వల్ల వచ్చే ఏడాది ఈ మెగాటోర్నీలోనూ సత్తా నిరూపించుకోనుంది.