మహిళా ప్రముఖ స్ప్రింటర్ అంజూ బాబీ జార్జ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు ప్రతిష్ఠాత్మక 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రకటించింది వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్. భారత క్రీడారంగం అభివృద్ధి కోసం ఆమె చేస్తున్న కృష్టికి, ఎక్కువ మంది ఆడపిల్లలు, మహిళలు తన అడుగుజాడల్లో నడిచేలా స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు ఈ పురస్కారాన్ని అందించింది.
జార్జ్.. 1977లో కేరళలో జన్మించిన ఈ మాజీ లాంగ్ జంప్ అథ్లెట్ ఇప్పటికీ క్రీడా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటోంది. 2016లో ఓ ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించి ఎంతోమంది ఆడపిల్లలకు శిక్షణ ఇస్తోంది. వారికి మెంటార్‌గానూ వ్యవహరిస్తోంది. ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గానూ ఉంటోంది.
జార్జ్ సాధించిన పతకాలు
- 2003 పారిస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో లాంగ్‌జంప్ విభాగంలో కాంస్య పతకం
- 2005 వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్స్‌లో బంగారు పతకం
- 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం
- 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం
- 2002 బుసాన్, 2006 దోహా ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం
- 2005 ఇంచియాన్, 2007 అమ్మన్ ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం, రజతం
జార్జ్‌తో పాటు ఒలింపిక్స్ ఛాంపియన్స్ ఎలైన్ థామ్సన్-హెరాకు 'వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రకటించింది వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్. ఈ పురస్కారాల ప్రదానోత్సవం వర్చువల్‌గా నిర్వహించారు.
ఇదీ చూడండి: BWF World Tour Finals: సింధు, శ్రీకాంత్ శుభారంభం