అమెరికాలోని యాంక్టన్‌లో త్వరలో జరిగే ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్-2021 కోసం భారత జట్టును ప్రకటించింది ఏఏఐ. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలు.. వారం రోజులపాటు జరుగుతాయి. పురుషులు, మహిళలు, మిక్స్డ్ డబుల్స్, టీమ్ విభాగాల్లో పోటీలు ఉండనున్నాయి.
టోక్యో ఒలింపిక్ ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్‌లకు జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతమున్న అనుభవజ్ఞులైన క్రీడాకారుల్లో ఆసియా గేమ్స్ పతక విజేతలైన అభిషేక్ వర్మ, జ్యోతి వెన్నం, కోమలిక బారి, ఆదిత్య చౌదరి, పార్త్ సాలుంఖేలు మన దేశం తరఫున బరిలో ఉన్నారు.
పురుషుల జట్టులో ప్రధానంగా సంగమప్రీత్ బిస్లా, అభిషేక్ వర్మ, రిషబ్ యాదవ్‌లు పోటీలో ఉండగా.. మహిళల జట్టులో ప్రియా గుర్జార్, ముస్కాన్ కిరార్, జ్యోతి వెన్నంలు బరిలో దిగుతున్నారు.
ఇవీ చదవండి: