WFI President: భాజపా ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్టేజ్‌పైనే ఓ కుర్ర రెజ్లర్‌పై చేయిచేసుకున్నారు. కోపం ఆపుకోలేక యువకుడి చెంపపై కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది..
ఝార్ఖండ్ రాంచీలో అండర్-15 జాతీయ రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే.. కొందరు ఎక్కువ వయస్సు ఉన్నాసరే పోటీల్లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. దీంతో నిర్వాహకులు.. దాదాపు 60 నుంచి 70 మందిని పోటీల్లో పాల్గొనకుండా చేశారు.
ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక రెజ్లర్ మాత్రం తాను క్వాలిఫై కాలేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. శుక్రవారం రెజ్లింగ్ పోటీల చివరిరోజున.. స్టేజ్‌పైన ఉన్న బ్రిజ్ భూషణ్‌తో ఏదో చెప్పబోయేందుకు ప్రయత్నించాడు. దీనికి ఆగ్రహించిన బ్రిజ్ భూషణ్.. యువకుడిని చెంపదెబ్బ కొట్టారు.
-
As instructed by @narendramodi , his MP started to train the wrestlers on the stage itself. Preparation for the next Olympics is at next level. #brijbhushansharansingh pic.twitter.com/Qf313HBzMs
— Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) December 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">As instructed by @narendramodi , his MP started to train the wrestlers on the stage itself. Preparation for the next Olympics is at next level. #brijbhushansharansingh pic.twitter.com/Qf313HBzMs
— Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) December 18, 2021As instructed by @narendramodi , his MP started to train the wrestlers on the stage itself. Preparation for the next Olympics is at next level. #brijbhushansharansingh pic.twitter.com/Qf313HBzMs
— Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) December 18, 2021
ఆ యువ రెజ్లర్ గోండాలోని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి అకాడమీలోనే శిక్షణ పొందాడని ఘటనానంతరం తెలిసింది.
"బాధితుడు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు సంబంధించిన కేంద్రంలోనే శిక్షణ పొందాడు. ఈ క్రమంలో అండర్-15 పోటీల్లో పాల్గొనేందుకు సాయం చేయమని కోరేందుకు వచ్చాడు. కానీ, బ్రిజ్.. అందుకు ఒప్పుకోలేదు. అధిక వయస్సుగలవారు అర్హతలేని పోటీల్లో పాల్గొనకుండా చేయడమే లక్ష్యంగా బ్రిజ్ పనిచేస్తున్నారు."
--వినోద్ తోమర్, డబ్ల్యూఎఫ్ఐ సెక్రటరీ.
యువ రెజ్లర్.. అధ్యక్షుడు బ్రిజ్‌కు కోపం వచ్చేలా చేశాడని వినోద్ చెప్పారు. అందుకే అతడిపై బ్రిజ్ చేయిచేసుకున్నారని వివరించారు. అయితే.. ఈ దృశ్యాలు వైరల్ కావడం వల్ల ఎంపీ వైఖరిని ప్రతిపక్ష నేతలు కొందరు తప్పుపడుతున్నారు.
2018 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అండర్-15 రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తోంది. అప్పటినుంచి అర్హతకు మించిన వారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారనే సమస్య ఎదుర్కొంటోంది.
ఇదీ చదవండి: