ETV Bharat / sports

'ఈ స్వర్ణంతో అయినా చెస్​ ప్లేయర్లను గుర్తించాలి'

ఫిడే ఆన్​లైన్​ చెస్​ ఒలింపియాడ్​లో ఇటీవలే భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పోటీలో రష్యాతో కలిసి ప్రపంచ చెస్ ఛాంపియన్​షిప్ టైటిల్​ను గెలిచింది. తాజాగా ఈ విజయంపై స్పందించారు దిగ్గజ చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్​ ఆనంద్​. ఈ గెలుపును పరిశీలించి అయినా క్రీడా అవార్డుల కోసం చెస్‌ ప్లేయర్లను పరిగణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆనంద్​.

Chess Olympiad gold news
'ఆ స్వర్ణ పతకాన్ని అపురూపంగా దాచుకుంటా...'
author img

By

Published : Sep 1, 2020, 10:53 AM IST

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో పసిడి సాధించడం ఓ అద్భుతమని అభిప్రాయపడ్డారు భారత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌. తొలిసారి ఒలింపియాడ్‌ పతకం సొంతం చేసుకున్న ఆనంద్‌.. సోమవారం ఆన్‌లైన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.

"ఈ టోర్నీ ఓ కలలా అనిపిస్తోంది. ఈ స్వర్ణం నాకెంతో ప్రత్యేకమైంది. యువ ప్లేయర్లకూ ఇదో గొప్ప విజయం. పసిడి గెలవడం ఓ అద్భుతమైన సందర్భం. ఈ పతకాన్ని అపురూపంగా దాచుకుంటా. ఈ విజయాన్ని ఊహించలేదు. సర్వర్‌ డౌన్‌ కావడం వల్ల మా తప్పు లేదని బలంగా వాదన వినిపించాం. నిబంధనల ప్రకారం ఇలాంటి సమస్య కారణంతో ఓటమి ఎదురైతే ఆ జట్టు ఆట నుంచి తప్పుకోవాల్సిందే. కానీ మా విషయంలో మాత్రం తప్పు మాది కాదని ఫిడే త్వరగానే గ్రహించి మాకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించింది. ఈ విజయంతో భారత్‌లో చెస్‌కు ఆదరణ మరింత పెరుగుతుందని అనుకుంటున్నా. ప్రభుత్వం కూడా ఆ దిశగా చొరవ తీసుకుంటుందనే నమ్మకం ఉంది. ఇప్పుడీ గెలుపుతో తిరిగి క్రీడా అవార్డుల కోసం చెస్‌ ప్లేయర్లను పరిగణిస్తారని అనుకుంటున్నా"

విశ్వనాథన్​ ఆనంద్​, భారత దిగ్గజ చెస్​ ప్లేయర్​

ఆనంద్​తో పాటు విదిత్‌, హరికృష్ణ, హంపి, హారిక, సరీన్‌, ప్రజ్ఞానంద, దివ్య తదితర ప్లేయర్లతో కూడిన భారత జట్టు.. ఆగస్టు 30న జరిగిన టోర్నీలో రష్యాతో సంయుక్త విజేతగా నిలిచింది. ఫలితంగా 93 ఏళ్ల ఫిడే ఆన్​లైన్​ చెస్​ ఒలింపియాడ్​ చరిత్రలో భారత్​ తొలిసారి స్వర్ణం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.