భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) భారత రెజ్లింగ్ సమాఖ్యను (డబ్ల్యూఎఫ్ఐ) (WFI) క్షమాపణలు కోరింది. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో అమర్యాదగా ప్రవర్తించినందుకు గానూ ఆమెపై చర్యలు తీసుకుంది డబ్ల్యూఎఫ్ఐ.
"వినేశ్ ఒక ఈ-మెయిల్ పంపింది. క్రమశిక్షణ కమిటీ ఆమె అభ్యర్థనను పరిశీలించనుంది. ఆమె సమాధానంతో కమిటీ సంతృప్తి చెందిందా లేదా అనేది చూడాల్సి ఉంది" అని డబ్ల్యూఎఫ్ఐలోని వర్గాలు వెల్లడించాయి.
ఒలింపిక్స్‌కు ముందు ప్రాక్టీస్ కోసం కోచ్ వోల్లర్ అకోస్‌తో కలిసి హంగేరీ వెళ్లింది వినేశ్. ఈవెంట్ సమయానికి టోక్యోకు చేరుకున్న ఆమె.. ఇతర భారత అథ్లెట్లతో కలిసి ఉండటానికి, ప్రాక్టీస్ చేయడానికి నిరాకరించింది. ఈ విషయంపై ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది డబ్ల్యూఎఫ్ఐ. దీనిపై వివరణ ఇవ్వడానికి ఆమెకు ఆగస్టు 16 వరకు గడువును కేటాయించింది.
ఇవీ చదవండి:
Olympics 2021: రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై తాత్కాలిక నిషేధం