భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన విజయం సృష్టించింది. గెలిస్తే పతకంతో పాటు ఒలింపిక్స్‌కు అర్హత లభించే మ్యాచ్‌లో తన పట్టు ప్రతాపం చూపించింది. బుధవారం కజకిస్థాన్ వేదికగా జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో... కాంస్య పతకం సాధించింది. రెపిఛేజ్ ద్వారా లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ ఘనత సాదించింది. పతకంతో పాటు ఒలింపిక్స్ బెర్త్నూ ఖారారు చేసుకుంది.
-
Olympic Quota for @Phogat_Vinesh #VineshPhogat qualifies for #Tokyo2020 in 53kg weight category after defeating top ranked Sarah Hildebrandt by 8-2 in the World Championships, Kazakhstan.
— Dept of Sports MYAS (@IndiaSports) September 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations Champion! 👏👏👏🇮🇳 pic.twitter.com/hnv0XcD8VE
">Olympic Quota for @Phogat_Vinesh #VineshPhogat qualifies for #Tokyo2020 in 53kg weight category after defeating top ranked Sarah Hildebrandt by 8-2 in the World Championships, Kazakhstan.
— Dept of Sports MYAS (@IndiaSports) September 18, 2019
Congratulations Champion! 👏👏👏🇮🇳 pic.twitter.com/hnv0XcD8VEOlympic Quota for @Phogat_Vinesh #VineshPhogat qualifies for #Tokyo2020 in 53kg weight category after defeating top ranked Sarah Hildebrandt by 8-2 in the World Championships, Kazakhstan.
— Dept of Sports MYAS (@IndiaSports) September 18, 2019
Congratulations Champion! 👏👏👏🇮🇳 pic.twitter.com/hnv0XcD8VE
రెపిఛేజ్తో ఛాన్స్...
ఈ టోర్నీలో 53 కిలోల విభాగంలో బరిలోకి దిగిన వినేశ్... కాంస్యం కోసం మరియా ప్రెవొలరకి(గ్రీక్)తో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో 4-1 తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమెకిదే తొలి పతకం. ఇప్పటికే మూడుసార్లు విఫలమైన వినేశ్ నాలుగోసారి తన కల నెరవేర్చుకుంది. ఫలితంగా దేశంలో అత్యంత విజయవంతమైన కుస్తీ మహిళగా, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి రెజ్లర్‌గా గుర్తింపు పొందింది.
అంతకు ముందు...
పసిడి కోసం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన వినేశ్ ఆశలకు... మంగళవారం జపాన్ రెజ్లర్ మేయు ముకైదా చెక్ పెట్టింది. అయితే మేయు ఫైనల్ చేరుకోవడం వల్ల వినేశ్‌కు రెపిఛేజ్ రూపంలో అదృష్టం వరించింది. వరుసగా జరిగిన మ్యాచ్‌ల్లో యులియాపై 5-0, హల్దెబ్రాండ్‌పై 8-2 తేాడాతో గెలిచి కాంస్య పోరుకు ఎంపికైంది.
చరిత్రలో 5వ రెజ్లర్‌గా...
భారత్ తరఫున ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన అయిదో మహిళా రెజ్లర్ వినేశ్. గతంలో అల్కా తోమర్ (2006), గీతా ఫొగాట్ (2012), బబితా ఫొగాట్ (2012) పూజా ధండా (2018) పతకాలు కైవసం చేసుకున్నారు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన వినేశ్ ప్రస్తుత పతకంతో దేశంలో అత్యంత విజయవంతమైన రెజ్లర్‌గా ఘనత సాధించింది.
భారత మరో క్రీడాకారిణి పూజా ధండా సెమీస్‌లో టెక్నికల్ సుపీరియారిటీతో లియుబోవ్ (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. అయితే ఇంకా కాంస్యం సొంతం చేసుకునేందుకు ఆమెకు అవకాశం ఉంది.