ETV Bharat / sports

బక్సమ్​ టోర్నీ: ఫైనల్లోకి మనీష్, వికాస్​ - బక్సమ్​ టోర్నీ

బక్సమ్​ టోర్నీ ఫైనల్లోకి భారత బాక్సర్లు మనీష్, వికాస్​ దూసుకెళ్లారు. సెమీస్​లో ఇద్దరూ 3-2 తేడాతో గెలుపొందడం గమనార్హం.

Vikas, Manish among six Indian male boxers in final of Boxam International
బక్సమ్​ టోర్నీ: ఫైనల్లోకి మనీష్, వికాస్​
author img

By

Published : Mar 6, 2021, 1:55 PM IST

బక్సమ్​ అంతర్జాతీయ బాక్సింగ్​ టోర్నీలో భారత బాక్సర్లు సత్తా చాటారు. తాజాగా మనీష్​ కౌశిక్​, వికాస్​ క్రిష్ణన్​ ఫైనల్లోకి చేరారు. 63 కేజీల విభాగంలో మనీష్​ కౌశిక్.. ఫ్రాన్స్​ బాక్సర్​ లాన్స్​ హమ్రాయ్​పై 3-2తో విజయం సాధించాడు. 69 కేజీల విభాగంలో వికాస్​ క్రిష్ణన్​.. కజకిస్థాన్ బాక్సర్​ అబ్లాయ్​ ఖాన్​పై 3-2 తేడాతో గెలుపొందాడు.

కామన్​వెల్త్​ కాంస్య పతక విజేత మహమ్మద్​ హుసాముద్దీన్​ (57 కేజీలు) కూడా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 4-1 తేడాతో పనామా ఓర్లాండో మార్టినెజ్​పై విజయం సాధించాడు.

ఇంకా.. సుమిత్​ సాంగ్వాన్​(81కేజీలు), సతీశ్​ కుమార్​( +91కేజీలు), ఆశిష్​ కుమార్​(75 కేజీలు) కూడా తమ తమ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించారు.

మహిళల్లో ముగ్గురు..

మహిళల విభాగంలో సిమ్రన్​జీత్​ కౌర్​ (60 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), జాస్మిన్ (51 కేజీలు) ఇప్పటికే ఫైనల్​ చేరుకున్నారు. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్​ మేరీకోమ్​ (51 కేజీలు) సెమీస్​లో ఓటమిపాలైంది. ఆమెకు కాంస్య పతకం దక్కనుంది.

ఇదీ చదవండి: చేజారిన శతకం.. కానీ ఈ ఇన్నింగ్స్​ 'సుందరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.