అమెరికా స్ప్రింటర్ ఎర్రియోన్ నైటోన్ పరుగులో రికార్డు సృష్టించాడు. కొన్నిరోజుల క్రితం స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ అండర్-18 రికార్డును తిరగరాసిన ఎర్రియోన్.. ఇప్పుడు మరో ఘనత సాధించాడు. ఒలింపిక్ ట్రయల్స్‌లో భాగంగా, అమెరికా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బోల్ట్ నెలకొల్పిన అండర్-20 రికార్డునూ తిరగరాశాడు.

యూఎస్ ఒలింపిక్ ట్రయల్స్ 200మీ పరుగు పోటీల్లో పాల్గొన్న ఎర్రియోన్.. 19.88 సెకండ్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. ఈక్రమంలోనే అండర్-20లో బోల్ట్ నెలకొల్పిన 19.93 సెకండ్ల రికార్డును అధిగమించాడు. దీంతో విశ్వక్రీడలకు ముందు యూఎస్‌కు జూనియర్ బోల్ట్ దొరికేశాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.