Djokovic News: వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తే.. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ నుంచి కూడా తాను తప్పుకుంటానని దిగ్గజ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ అన్నాడు. టీకాపై ఓ ఇంటర్వూలో ప్రశ్నించగా.. 'అవసరమైతే గ్లాండ్స్లామ్ల నుంచి తప్పుకుంటాను కానీ.. వ్యాక్సిన్ వేసుకోను' అని స్పష్టం చేశాడు.
"నా నిర్ణయం వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొంటాను. నేను ఆడటానికి టీకా తప్పనిసరి చేస్తే.. ఆ గ్రాండ్‌స్లామ్‌ల నుంచి నిష్క్రమిస్తా. కానీ టీకాపై నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు."
- నొవాక్ జకోవిచ్
టీకా తీసుకోకపోవడం వల్ల జకోవిచ్ ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఈ వ్యవహారంలో జకో వీసాను కూడా ఆస్ట్రేలియా రద్దు చేసింది.
ఇవీ చదవండి: