ETV Bharat / sports

Olympics: 20 సెకన్ల ఆలస్యం.. ఒలింపిక్స్​కు స్టార్ అథ్లెట్ దూరం - బ్రిటీష్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్

పరుగుల వీరుడు, రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మో ఫరా(Mo Farah).. ఈసారి ఒలింపిక్స్​కు దూరమయ్యాడు. బ్రిటీష్ ఛాంపియన్​షిప్​లో పాల్గొన్న ఇతడు.. ఒలింపిక్స్​కు కావాల్సిన అర్హత సమయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో పోటీలకు అర్హత సాధించలేకపోయాడు.

Mo Farah
మో ఫరా
author img

By

Published : Jun 26, 2021, 12:08 PM IST

బ్రిటన్​కు చెందిన అథ్లెట్ మో ఫరా(Mo Farah).. తన సుదూర పరుగుతో ఎన్నో రికార్డులు, ఘనతలూ సాధించాడు. చివరగా రియో ఒలింపిక్స్​లో రెండు స్వర్ణాలతో పాటు మొత్తంగా నాలుగుసార్లు ఒలింపిక్స్ ఛాంపియన్​గా నిలిచాడు. కానీ ఈ ఏడాది టోక్యోలో జరగనున్న విశ్వ క్రీడల(Tokyo Olympics)కు కనీసం అర్హత సాధించలేకపోయాడు. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్​లో భాగంగా బ్రిటీష్ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో 27ని.28 సెకండ్ల కనీస అర్హత సమయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి మెగాక్రీడలకు దూరమయ్యాడు.

2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్​లో స్వర్ణాలతో సత్తాచాటిన మో ఫరా క్రీడాలోకానికి స్ఫూర్తిగా నిలిచాడు. కానీ బ్రిటీష్ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో చివరి మూడున్నర కిలోమీటర్లు చాలా ఇబ్బంది పడిన ఇతడు 27.47.04 సమయంలో తన పరుగును పూర్తి చేశాడు. దీంతో 20 సెకండ్ల వ్యవధిలో ఒలింపిక్స్ అర్హతను కోల్పోయాడు.

Mo Farah
మో ఫరా

ఫరా రికార్డులు..

ఇతడి అసలు పేరు మహ్మద్ ముక్తార్ జమా ఫరా. 1999 నుంచి వివిధ అంతర్జాతీయ, యురోపియన్ యూనియన్ ఈవెంట్లలో రికార్డు టైమింగ్‌తో సత్తాచాటాడు. కానీ.. బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రం నిరాశే ఎదురైంది. లండన్ ఒలింపిక్స్‌లో 10వేల మీటర్ల పరుగులో, 5వేల మీటర్ల పరుగులో స్వర్ణాలు సాధించి బ్రిటన్ తరపున లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో తొలి స్వర్ణం అందుకున్న అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మాస్కోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్‌లోనూ స్వర్ణం సాధించాడు. 2015లో యూరో, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో డబుల్​ గోల్డ్‌మెడల్​తో రికార్డు సృష్టించాడు.

ఇవీ చూడండి: Sushil kumar: సుశీల్​తో పోలీసుల సెల్ఫీ.. విచారణకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.