ETV Bharat / sports

ఒలింపిక్​​ 'గోల్డ్​ మెడల్'​లో బంగారం ఎంతో తెలుసా? - ఒలింపిక్స్ లేెటెస్ట్ న్యూస్

ప్రతి నాలుగేళ్లకొకసారి జరిగే ఒలింపిక్స్​లో విజేతలకు పతకాలు ఇస్తారు. అయితే ఆ మెడల్స్ ఎంత విలువ చేస్తాయో ఏమైనా తెలుసా? పోనీ ఎప్పుడైనా ఆలోచించారా? లేకపోతే ఈ స్టోరీ చదివేయండి.

.
.
author img

By

Published : Jul 22, 2021, 12:31 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు రంగం సిద్ధమైంది. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడిన పోటీలు.. జులై 23 నుంచి యమస్పీడుగా జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోదేశాలకు చెందిన అథ్లెట్లు.. బంగారు పతకమే లక్ష్యంగా ఏళ్లుగా శ్రమిస్తుంటారు. ఎందుకంటే ఆ మెడల్ ఒక్కసారి అందుకుంటే వాళ్ల పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అయితే ఆ పతకం విలువ ఎంత ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకున్నారా?

.
.

పతకాల కోసం 62 లక్షల మొబైల్స్

టోక్యో ఒలింపిక్స్ కోసం..​ చరిత్రలోనే తొలిసారి రీసైక్లింగ్ చేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పతకాలు తయారుచేశారు. వీటినే విజేతలకు అందజేయనున్నారు. మెడల్స్​ కోసం దాదాపు 62 లక్షల మొబైల్​ ఫోన్లను జపాన్ పౌరులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అందజేశారు. 32 కిలోల బంగారం కూడా స్వర్ణ పతకాల కోసం దానం చేశారు.

పతకం బరువెంత?

టోక్యో ఒలింపిక్స్​లో ఇచ్చే గోల్డ్ మెడల్ బరువు 556 గ్రాములు. రజతం 550 గ్రాములు, కాంస్యం 450 గ్రాములు ఉండనుంది.

భారత్​లో బంగారం ధర ప్రకారం.. గోల్డ్​ మెడల్​కు రూ.26 లక్షల కంటే ఎక్కువే వస్తుంది. అయితే ఈ పతకాన్ని అమ్మితే అతడికి వచ్చే మొత్తం రూ.65,790 మాత్రమే.

.
.

కారణమిదే..

556 గ్రాముల స్వర్ణ పతకం అన్నారు. ఇంత తక్కువ ధర రావడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? పతకంలో బంగారం 6 గ్రాములు మాత్రమే. మిగిలిన 550 గ్రాములు వెండి ఉంటుంది. దీని ప్రకారం మన దేశంలో 6 గ్రా. గోల్డ్​ విలువ సుమారుగా రూ.28,550 ఉంది. సిల్వర్​ విలువ 550 గ్రా. సుమారు రూ.37,290. ఈ లెక్కన మొత్తం కలిపి రూ.65,840 అవుతుంది.

టోక్యో ఒలింపిక్స్​ విజేతలకు మెడల్స్​తో పాటు ఓ బాక్స్​ ఇవ్వనున్నారు. దీనిని ప్రత్యేకమైన కలపతో తయారుచేశారు. ఇందులో ప్రతి విజేతకు ఇచ్చే బాక్స్​ వేర్వేరుగా ఉండటం విశేషం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.