ETV Bharat / sports

స్టార్ క్రికెటర్లను దాటేసిన నీరజ్ చోప్డా! - నీరజ్ చోప్రా తాజా వార్తలు

టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్డా సోషల్​ మీడియా వాల్యువేషన్(neeraj chopra social media valuation)​ అమాంతంగా పెరిగింది. డిజిటల్‌ మీడియాలో ఇతడి ప్రస్తావన సుమారు 2055 శాతంగా ఉంది.

Neeraj Chopra
నీరజ్
author img

By

Published : Sep 17, 2021, 4:02 PM IST

Updated : Sep 17, 2021, 4:27 PM IST

టోక్యో ఒలింపిక్స్​(neeraj chopra olympics)లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్డా. అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత గోల్డ్ గెలిచిన అథ్లెట్​గా రికార్డులకెక్కాడు. ఈ ఘనత తర్వాత ఎక్కడ చూసిన నీరజ్ పేరు మారుమోగిపోయింది. అటు సోషల్​ మీడియాలోనూ ఇతడి అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్లు పెరిగిపోయారు. తాజాగా సోషల్ మీడియా వాల్యువేషన్​(neeraj chopra social media valuation)లోనూ ఇతడు తన హవా చూపించాడు.

ప్రముఖ పరిశోధన సంస్థ యూగోవ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌(neeraj chopra instagram)లో మోస్ట్‌ మెన్షన్‌ పర్సన్‌గా నీరజ్‌ నిలిచాడు. ఇన్​స్టాలో సుమారు 2.9 మిలియన్ల యూజర్లు నీరజ్‌ గురించి ప్రస్తావించారు. డిజిటల్‌ మీడియా వేదికలో ఇతడి ప్రస్తావన సుమారు 2055 శాతంగా ఉంది. దీంతో నీరజ్‌ చోప్రా సోషల్ మీడియా వాల్యుయేషన్‌​(neeraj chopra social media valuation) ఏకంగా 428 కోట్లకు పెరిగిందని ఆ సంస్థ వెల్లడించింది.

క్రికెటర్లను దాటేసి..

యూగోవ్‌ స్పోర్ట్‌ నివేదిక ప్రకారం, స్వర్ణ పతకం సాధించినప్పటి నుంచి నీరజ్‌ చోప్డా సోషల్ మీడియాలో ఇంటారక్షన్స్‌(neeraj chopra social media valuation) సుమారు 86.3శాతం చొప్పున 12.79 మిలియన్లకు పెరిగాయి. 4.05 మిలియన్ల వీడియో ఎంగేజ్‌మెంట్‌ ఇంటారక్షన్స్‌ కూడా నమోదయ్యాయి. దీంతో ఇంటరాక్షన్‌లో టీమ్ఇండియా క్రికెటర్లు రాహుల్‌, పంత్‌లను దాటేశాడు నీరజ్. అలాగే ఇతడి ఖాతాను అనుసరించే(neeraj chopra instagram followers) వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది, నీరజ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఇప్పుడు 4.5 మిలియన్లకు చేరుకుంది. అంటే స్వర్ణం సాధించాక ఇతడి ఫాలోవర్స్‌లో 2297శాతం మేర పెరుగుదల కనిపించింది.

పెరిగిన బ్రాండ్ వాల్యూ

2020 ఒలింపిక్స్​కు ముందు నీరజ్ చోప్డా.. ప్రకటనల కోసం తీసుకునే పారితోషికం ఏడాదికి 15-25 లక్షల మధ్య ఉండేది. అయితే.. ఒలింపిక్స్​లో 87.58 రికార్డు త్రోతో స్వర్ణం సాధించిన తర్వాత అతడి ప్రకటనల పారితోషికం 10 రెట్లు పెరిగింది (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ప్రస్తుతం దేశంలోని క్రీడాకారులందరిలో.. టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(virat kohli brand value) మాత్రమే 1-5 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటున్నాడు. నీరజ్​ కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం. కానీ, కోహ్లీతో పోల్చితే.. నీరజ్​ సంపాదన కాస్త తక్కువగానే ఉంటుందని నిపుణులు తెలిపారు. మరోవైపు.. రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఆర్జించే క్రికెటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్​ను కూడా నీరజ్​ అధిగమించడం విశేషం.

ఇప్పటివరకు 80 బ్రాండ్​లు నీరజ్​తో ప్రకటనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని జేఎస్​డబ్ల్యూ స్పోర్ట్స్ చీఫ్​ ఎగ్జిక్యూటివ్ ముస్తఫా గౌస్ తెలిపారు. పారిస్​ ఒలింపిక్స్​ వరకు పలు బ్రాండ్​లతో ప్రకటనలు చేసేందుకు నీరజ్​ ఒప్పుకొన్నట్లు పేర్కొన్నారు. మద్యం, పొగాకు ఉత్పత్తుల బ్రాండ్​లకు ప్రకటనలు ఇవ్వకూడదని చోప్డా​ నిర్ణయించుకున్నట్లు గౌస్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: ఐపీఎల్​ మిస్టరీ భామలు.. మరి ఈసారి ఎవరో?

Last Updated : Sep 17, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.