ETV Bharat / sports

'పారిస్ ఒలింపిక్స్​కు తక్కువ సమయం.. ప్రాక్టీస్​ కష్టతరమే' - అభినవ్ బింద్రా పారిస్ ఒలింపిక్స్

పారిస్​-2024 ఒలింపిక్స్​ కాస్త కఠినతరంగా ఉండబోతున్నట్లు తెలిపాడు భారత ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా. విశ్వక్రీడలకు మూడేళ్ల సమయమే ఉండటం ఇందుకు కారణమని వెల్లడించాడు.

Abhinav Bindra
అభినవ్ బింద్రా
author img

By

Published : Aug 19, 2021, 3:09 PM IST

నీరజ్ చోప్రా స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్​ను ఘనంగా ముగించింది భారత్. అలాగే విశ్వక్రీడల చరిత్రలో ఎక్కువ పతకాలు సాధించింది ఇండియా. మొత్తం ఏడు పతకాలు దక్కించుకుంది. కానీ కరోనా కారణంగా వచ్చే ఒలింపిక్స్​ మూడేళ్లలోనే జరగనున్నాయి. గతేడాది జరగాల్సిన టోక్యో క్రీడలు ఏడాది వాయిదపడటమే ఇందుకు కారణం. తాజాగా ఈ విషయంపై స్పందించిన భారత ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా.. వచ్చే పోటీలు కాస్త కష్టతరంగా ఉండబోతున్నాయని తెలిపాడు.

"టోక్యో ఒలింపిక్స్​లో ఏడు పతకాలతో భారత్ మంచి ప్రదర్శన చేసింది. భవిష్యత్​లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగుతుంది. కానీ వచ్చే ఒలింపిక్ సైకిల్ కాస్త కష్టతరంగా ఉండబోతుంది. తక్కువ సమయం ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా ఒలింపిక్స్ ముగిశాక విశ్రాంతి, రికవరీ కోసం ఆటగాళ్లకు ఏడాది అవసరమవుతుంది. అయితే ఈసారి విశ్వక్రీడలు తొందరగా జరగబోతున్నాయి."

-అభినవ్ బింద్రా, షూటర్

కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాది జరిగాయి. అలాగే 2024లో పారిస్ ఒలింపిక్స్​లో జరగబోతున్నాయి. దీంతో క్రీడాకారులకు మూడేళ్ల సమయమే లభించనుంది. అందువల్ల వారు వీలైనంత తొందరగా మళ్లీ విశ్వక్రీడల కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్​ పోటీలు, కోటా కూడా తగ్గే అవకాశం ఉంది.

క్రీడల్లో మరింత పురోగతి సాధించేందుకు కింది స్థాయి నుంచి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నాడు బింద్రా.

"అథ్లెట్లకు ట్రైనింగ్​లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, విశ్లేషణ వంటి సామర్థ్యాలు పెంపొందించాలి. జాతీయ స్థాయిలోనే కాక జూనియర్ స్థాయిలోనూ వారికి సంపూర్ణ శిక్షణ అందించాలి. అలాగే దేశంలో కళాశాల స్థాయిలో క్రీడా వ్యవస్థ బలోపేతం కావాలి" అని వెల్లడించాడు బింద్రా.

ఇవీ చూడండి: పసికందు 'గుండె'​ కోసం ఆమె ఒలింపిక్ పతకం వేలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.