ETV Bharat / sports

మెస్సికి బెదిరింపులు.. సూపర్​మార్కెట్​పై కాల్పులు.. 'వెయిటింగ్​ ఫర్​ యూ..' అని రాసి మరీ! - మెస్సి కు బెదిరింపులు

ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్లేయర్‌ మెస్సికి బెదిరింపులు వచ్చాయి. అతడి భార్య కుటుంబసభ్యులకు చెందిన ఓ సూపర్‌ మార్కెట్‌పై గుర్తుతెలియని వ్యక్తులు.. కాల్పులకు పాల్పడ్డారు. అనంతరం 'మెస్సి.. నీ కోసం ఎదురుచూస్తున్నాం' అంటూ నేలపై రాసి వెళ్లారు. అసలేం జరిగిందంటే?

messi threat
messi threat
author img

By

Published : Mar 3, 2023, 4:44 PM IST

Updated : Mar 3, 2023, 4:50 PM IST

ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సిని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. మెస్సి భార్య తరఫున కుటుంబసభ్యులకు చెందిన ఓ సూపర్‌ మార్కెట్‌పై గుర్తుతెలియని వ్యక్తులు.. గురువారం అర్ధరాత్రి వేళ కాల్పులు జరిపారు. సుమారు 14 రౌండ్ల బుల్లెట్లు పేల్చినట్లు సమాచారం. అనంతరం.. 'మెస్సి నీ కోసం ఎదురుచూస్తున్నాం' అని నేలపై రాసి మరీ వెళ్లారు. అర్జెంటీనాలోని మెస్సి స్వస్థలం రోసారియో నగరంలో జరిగిన ఈ ఘటన జరిగింది. మొత్తం ఘటనను మేయర్‌ జావ్కిన్ ధ్రువీకరించారు.

అయితే స్థానికంగా గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ఈ ఘటనకు దుండగులు పాల్పడినట్లు భావిస్తున్నామని జావ్కిన్​ అన్నారు. మెస్సిపై దాడి కంటే ప్రపంచంలో ఏ స్టోరీ వేగంగా వైరల్ కాగలదని వ్యాఖ్యానించారు. ఇదంతా కొంతకాలంగా జరుగుతోందని చెప్పారు. పోలీసులు సైతం.. ఇది ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నమేనని వెల్లడించారు.

ఇకోపోతే, గతేడాది డిసెంబరులో ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టుకు మెస్సియే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఆ అపురూప విజయానికి గుర్తుగా తన అర్జెంటీనా జట్టు సభ్యులు, సిబ్బందికి మరపురాని బంగారు ఐఫోన్‌లు గిఫ్ట్​లుగా ఇచ్చాడు. రూ.1.72 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన 35 ఐఫోన్‌లను తోటి క్రీడాకారులకు, స్టాఫ్‌కు కానుకలుగా అందజేశాడు

తన తోటి ఆటగాళ్లు, సిబ్బంది ఈ అద్భుత విజయాన్ని ఎప్పటికీ సెలబ్రేట్‌ చేసుకునేలా వ్యక్తిగత బహుమతులు ఇవ్వాలని మెస్సి భావించాడు. ఈ క్రమంలోనే 24 క్యారెట్ బంగారు స్మార్ట్‌ఫోన్‌లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై ఐడిజైన్‌ గోల్డ్‌ సంస్థను సంప్రదించాడు. ప్రతి ఫోన్‌ వెనుక భాగంలో సంబంధిత క్రీడాకారుడు, సిబ్బంది పేరు, షర్ట్‌ నంబర్‌, అర్జెంటీనా టీం లోగో, వరల్డ్ కప్ ఛాంపియన్స్ 2022 అని వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించాడు. ఇటీవలే ఈ ఫోన్‌లను డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ధ్రువీకరించింది. సంబంధిత ఫోన్‌ ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఇవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.

Last Updated : Mar 3, 2023, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.