టోక్యో పారాలింపిక్స్‌కు భారత జట్టు 24 మంది అథ్లెట్లను బరిలో దించుతోంది. తంగవేలు మరియప్పన్, దేవేంద్ర జజారియా లాంటి స్టార్ అథ్లెట్లతో కూడిన 24 మంది సభ్యుల జాబితాను భారత పారాలింపిక్ కమిటీ విడుదల చేసింది. రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు గెలిచిన మరియప్పన్, దేవేంద్రతో పాటు తమ విభాగాల్లో ప్రపంచ రికార్డులు ఖాతాలో ఉన్న సందీప్ చౌదరి, సుమిత్ లాంటి వాళ్లు ఈ క్రీడలకు వెళ్తున్నారు.
జూన్ 29, 30 తేదీల్లో దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ట్రయల్స్ ద్వారా దీపా మలిక్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఈ అథ్లెట్లను ఎంపిక చేసింది. ఈ జట్టులో దేవేంద్ర జజారియా, అజీత్ సింగ్, సుందర్ సింగ్ గుర్జార్ (జావెలిన్, ఎఫ్ 46), సందీప్ చౌదరి, సుమిత్ (జావెలిన్ ఎఫ్ 64), తంగవేలు, శరద్‌కుమార్, వరుణ్ బాటి (హైజంప్, టీ-63), అమిత్‌కుమార్, ధర్మబీర్ (క్లబ్ త్రో ఎఫ్-51), నిషద్ కుమార్, రామాల్ (హైజంప్, టీ-47), ప్రవీణ్ కుమార్ (హైజంప్ టీ-64), యోగేశ్ (డిస్కస్ త్రో ఎఫ్-56), వినోద్ (డిస్కస్‌తో ఎఫ్-56), రంజిత్ (జావెలిన్ ఎఫ్ 57), అరవింద్ (షాట్‌పుట్ ఎఫ్-35), తెక్చంద్ (జావెలిన్ ఎఫ్-54), నవీప్ (జావెలిన్ ఎఫ్ 41), సోనమ్ రాణా (షాట్‌పుట్, ఎఫ్-57), ఏక్తా. కాశిప్ లాక్రా (క్లబ్ త్రో ఎఫ్-51), భాగ్యశ్రీ (షాట్‌పుట్ ఎఫ్-34), సిమ్రన్ (100 మీ, టీ-13) ఉన్నారు. సంజయ్ (జావెలిన్ ఎఫ్-64) రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు.
ఆగస్టు 24న పారాలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.
ఇదీ చదవండి: ప్రపంచ రికార్డుతో టోక్యో పారాలింపిక్స్‌కు దేవేంద్ర