ETV Bharat / sports

నం.1 ​కు హంపి చెక్‌.. స్పీడ్‌ చెస్‌ ఫైనల్లోకి ప్రవేశం

తెలుగు గ్రాండ్​మాస్టర్​ కోనేరు హంపి ప్రపంచస్థాయి వేదికపై మరోసారి సత్తా చాటింది. తనదైన ప్రదర్శనతో సెమీస్​లో ప్రపంచ నెం.1, చైనా ప్లేయర్​ హో ఇఫాన్​ను ఓడించింది. ఫలితంగా ఫిడే మహిళల స్పీడ్​ చెస్​ ఛాంపియన్​షిప్​లో టైటిల్​కు అడుగుదూరంలో నిలిచింది.

chess koneru hampi
నం.1 కు తెలుగమ్మాయి చెక్‌.. స్పీడ్‌ చెస్‌ ఫైనల్లోకి ప్రవేశం
author img

By

Published : Jul 18, 2020, 7:39 AM IST

మహిళల స్పీడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్‌మాస్టర్‌, ర్యాపిడ్‌ ప్రపంచ ఛాంపియన్‌ కోనేరు హంపి అద్భుత విజయం సాధించింది. ప్రపంచ నంబర్‌వన్‌ హో ఇఫాన్‌ (చైనా)కు షాకిస్తూ ఈ తెలుగమ్మాయి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

శుక్రవారం జరిగిన సెమీస్‌లో హంపి 6-5తో ఇఫాన్‌ను ఓడించింది. ఈ పోరులో తొలి గేమ్‌ హంపి గెలవగా.. ఆ తర్వాత గేమ్‌ను ఇఫాన్‌ దక్కించుకుంది. ఆ తర్వాత రెండు గేమ్‌లను హంపి, ఇఫాన్‌ చెరొకటి నెగ్గడం వల్ల పోటీ ఉత్కంఠగా మారింది.

ఈ స్థితిలో ఒత్తిడిని తట్టుకుంటూ నిర్ణయాత్మక గేమ్‌ను గెలిచిన హంపి.. ఫైనల్లోకి ప్రవేశించింది. అలెగ్జాండ్రా కోస్తెనెక్‌ (రష్యా), సరాసాదత్‌ (ఇరాన్‌) మధ్య సెమీస్‌ విజేతతో హంపి.. టైటిల్‌ పోరులో తలపడనుంది.

ఇదీ చూడండి: తెలుగమ్మాయి భళా: కెయిన్స్​ కప్ విజేతగా కోనేరు హంపి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.