ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్.. మూడు నెలల అనంతరం స్వదేశానికి నేడు చేరుకోనున్నారని అతడి భార్య అరుణ వెల్లడించారు. బండెస్లిగా చెస్ లీగ్‌లో పాల్గొనడానికి జర్మనీ వెళ్లారు ఆనంద్. అదే సమయంలో లాక్డౌన్ విధించడం వల్ల అక్కడే చిక్కుకుపోయారు.
"అవును, ఆనంద్ ఈ రోజు వస్తున్నారు. ప్రభుత్వాదేశాల మేరకు 14 రోజుల నిర్బంధం తర్వాతే చెన్నై రానున్నారు" అని అరుణ చెప్పారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం(ఏఐ-120)లో బయలుదేరి, శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరు విమానాశ్రయంకు రానున్నారు. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులు ఐసోలేషన్‌లో గడపనున్నారు.
జర్మనీలో చిక్కుకుపోయిన ఆనంద్.. చెన్నైలోని తన కుటుంబంతో రోజూ వీడియో కాల్స్ మాట్లాడుతూ టచ్‌లో ఉన్నారు. ఇటీవలే నిర్వహించిన ఆన్లైన్ చెస్ పోటీల్లో పాల్గొని, కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాన్ని అందించారు.
ఇదీ చూడండి... 'చెస్ అంటే బోర్డ్‌పై కాదు.. ఆలోచనలపై గెలవాలి'