ETV Bharat / sports

ఈ పాపే జూనియర్​ ​బోల్ట్ 'లైట్నింగ్' ​ - పరుగుల వీరుడు బోల్ట్ పాప 'లైట్నింగ్' ​

పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌.. ఇటీవల తన భార్యకు జన్మించిన కూతురు ఫొటోను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు. తన పేరు 'లైట్నింగ్​' అని ప్రకటించాడు.

Lightning
'లైట్నింగ్' ​
author img

By

Published : Jul 9, 2020, 9:31 AM IST

జమైకా దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ ఇటీవల తండ్రి అయ్యాడు. బోల్ట్‌ భాగస్వామి కాసీ బెన్నెట్‌ జూన్‌ 14న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటి వరకు తన కూతురు ఫొటో కానీ, పేరును కానీ అతడు ప్రకటించలేదు.

అయితే తాజాగా తన భార్య కాసీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో కూతురు ఫొటోను షేర్‌ చేసి పేరును ప్రకటించాడు బోల్ట్. 'నా ప్రియురాలు కాసీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజున నీతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నా. నేను మీ ఆనందాన్ని తప్ప మరేది కోరుకోను. నిన్ను ఎప్పుడు సంతోషంగా, చిరునవ్వుతో ఉంచడం నా బాధ్యత. మేము మా కూతురు 'ఒలింపియా లైట్నింగ్'‌తో కొత్త జీవితాన్ని ప్రారంభిచాం' అంటూ బోల్ట్‌ తన కూతురి పేరును ప్రకటించాడు.

పరుగుల చిరుత బోల్డ్​ విజయం సాధించిన ప్రతిసారీ మెరుపు సంకేతాన్ని చూపిస్తూ సంబరాలు చేసుకుంటుంటాడు. అయితే తన కూతురు పేరులో కూడా లైట్నింగ్​(మెరుపు) వచ్చేలా నామకరణం చేశాడు.

ఇది చూడండి : 'కోహ్లీ భయ్యా! మా ఇల్లూ దగ్గరే.. బిర్యానీ పంపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.