ETV Bharat / sports

జమైకా పరుగుల వీరుడి ఇంటికి బుల్లి స్ప్రింటర్​

author img

By

Published : May 19, 2020, 1:37 PM IST

జమైకా పరుగుల వీరుడు ఉసేన్​ బోల్ట్​కు ఆడపిల్ల పుట్టిందని ఆ దేశ ప్రధాన మంత్రి ఆండ్రూ హోనెస్​ వెల్లడించారు. బోల్డ్​ దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం ట్వీట్​ చేశారు.

Sprint legend Bolt and partner welcome baby girl
జమైకా పరుగుల వీరుడి ఇంటికి కొత్త స్పింటర్​

జమైకా పరుగుల వీరుడు ఉసేన్​ బోల్ట్​ తండ్రి అయ్యాడని ఓ ఇంగ్లీష్​ పత్రిక పేర్కొంది. బోల్ట్ భార్య కాసి బెన్నెట్ ఆదివారం ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఆ దేశ ప్రధానమంత్రి సోమవారం ట్వీట్​ చేశారు.

"ఆడపిల్లకు జన్మనిచ్చిన మా పరుగుల వీరుడు ఉసేన్​ బోల్ట్​కు, అతని భార్య కాసి బెన్నెట్​కు శుభాకాంక్షలు". - ఆండ్రూ హోనెస్​, జమైకా ప్రధానమంత్రి

బోల్ట్​, కాసి బెన్నెట్​.. అమ్మాయి పుడితే బాగుంటుందని మార్చిలో సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. భవిష్యత్​లో తన కుమార్తె స్వయంవరం కోసం వచ్చే వారు ఆమె గురించి తెలుసుకొని రావాలని సరదాగా వ్యాఖ్యానించారు.

పరుగులో ప్రపంచరికార్డు

100మీ, 200మీ పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఉసేన్​ బోల్ట్..​ దశాబ్దకాలం ఆధిపత్యం తర్వాత 2017లో అథ్లెటిక్స్​ నుంచి రిటైర్​ అయ్యాడు. వరుసగా మూడు ఒలిపింక్స్​లో 100మీ, 200మీ పరుగు పందెంలో బంగారు పతకం సాధించిన ఏకైక వ్యక్తిగా బోల్ట్​ రికార్డు సృష్టించాడు. ​

ఇదీ చూడండి.. 'మూడు ఫార్మాట్లలో కోహ్లీయే అత్యుత్తమం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.