కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)'ను మరింత విస్తృతపర్చనున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2024, 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని టాప్స్‌లో మరింత మంది అథ్లెట్లకు చోటు కల్పిస్తామన్నారు. టోక్యోలో పతకాలు గెలిచిన క్రీడాకారులకు ఆదివారం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. "2024 ఒలింపిక్స్ తర్వాత ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తే వేదిక మీద పట్టలేనంత మంది పతక విజేతలు ఉండాలి" అని మంత్రి పేర్కొన్నారు.
పసిడి గెలిచిన నీరజ్ చోప్డాకు రూ.75 లక్షలు, రజతాలు నెగ్గిన మీరాబాయి, రవి దహియాలకు చెరో రూ.40 లక్షలు, కాంస్యాలు సొంతం చేసుకున్న పీవీ సింధు, లవ్లీనా, బజ్‌రంగ్ పునియాకు తలో రూ.25 లక్షలను ఐఓఏ అందించింది. కంచు నెగ్గిన పురుషుల హాకీ జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చింది.
ఇదీ చదవండి : MS Dhoni: అభిమాని సాహసం.. ధోనీని కలిసేందుకు పాదయాత్ర