ETV Bharat / sports

రెజ్లింగ్​ సమాఖ్యకు సాయ్​ నోటీసులు - Cognizance Notices

రెజ్లింగ్​ సమాఖ్యకు సాయ్​ నోటీసులు జారీ చేసింది. నోయిడా వేదికగా జరుగుతున్న రెజ్లింగ్​ పోటీల్లో ఆటగాళ్లు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిపింది. సోమవారం నాటికి నివేదిక అందించాలని ఆదేశించింది.

Sports Authority of India has issued Cognizance Notices to the Wrestling Federation of India
రెజ్లింగ్​ సమాఖ్యకు సాయ్​ నోటీసులు
author img

By

Published : Jan 24, 2021, 1:52 PM IST

రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా(డబ్ల్యూఎఫ్​ఐ)కు.. స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(సాయ్) కాగ్నిజెన్స్​ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం నోయిడా వేదికగా జరుగుతున్న రెజ్లింగ్​ నేషనల్​ ఛాంపియన్​షిప్​లో పాల్గొన్న ఆటగాళ్లు కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించడమేల ఇందుకు కారణమని పేర్కొంది. సంబంధిత అంశంపై సోమవారం నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

"రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియాపై వచ్చిన ఆరోపణల కారణంగా చర్యలకు ఉపక్రమించాం. ప్రతి ఒక్కరు కరోనా మార్గదర్శకాలు పాటించాల్సిన అవసరం ఉంది. సదరు ఘటనపై రెజ్లింగ్​ సమాఖ్య నుంచి నివేదిక కోరాం.

-సందీప్​ ప్రధాన్​, సాయ్​ డైరెక్టర్​ జనరల్​

కాగా, సాయ్​ అడిగిన నివేదిక ఇవ్వడానికి సమాఖ్య సమ్మతించింది.

నోయిడా స్టేడియంలో క్రీడల తొలి రోజు ఆటగాళ్లు కరోనా నిబంధనలు గాలికొదిలేసారని మీడియా నివేదించింది. దీంతో సాయ్​ ఈ చర్యలకు ఉపక్రమించింది. కొవిడ్​ సమయంలో జరుగుతున్న అతి పెద్ద క్రీడా సంగ్రామం ఇదే కావడం విశేషం.

మరోవైపు, అథ్లెట్ల భద్రత దృష్ట్యా కరోనా ప్రోటోకాల్​ విధిగా పాటించేలా చూడాలని..​ ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​ను సాయ్​ కోరింది. అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలకు ఆదేశాలు జారీ చేయాలని సూచించింది.

ఇదీ చదవండి: 'మన్​ కీ బాత్'​పై రాహుల్​ పరోక్ష విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.