భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ మరో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఆరుసార్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన ఈమె పేరు చివరన 'ఒలి' అనే పదాన్ని చేర్చింది ప్రపంచ ఒలింపియన్స్ అసోసియేషన్. సంబంధిత ఫొటోను ట్విట్టర్లో పంచుకుంది మేరీ. తనకు అవకాశం ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసింది.
-
Thank you so much for the RECOGNITION @worldolympians @iocmedia pic.twitter.com/WRY5nnFmeD
— Mary Kom (@MangteC) November 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you so much for the RECOGNITION @worldolympians @iocmedia pic.twitter.com/WRY5nnFmeD
— Mary Kom (@MangteC) November 7, 2019Thank you so much for the RECOGNITION @worldolympians @iocmedia pic.twitter.com/WRY5nnFmeD
— Mary Kom (@MangteC) November 7, 2019
సమాజంలో ఓ ఒలింపియన్‌గా, ఒలింపిక్ క్రీడల విలువలను ప్రచారం చేసే క్రీడాకారులకు కొందరికి.. తమ పేరు చివరన 'ఒలి' అనే పదాన్ని జత చేస్తారు. 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ పదాన్ని తమ పేరు చివర డిగ్రీలా క్రీడాకారులు ఉంచుకోవచ్చు. ధ్రువపత్రాల్లోనూ రాసుకోవచ్చు.
గతేడాది జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది మేరీకోమ్. సెమీఫైనల్లో టర్కీకి చెందిన బుసనెజ్ చేతిలో ఓడిపోయింది.
మేరీకోమ్.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఎనిమిది పతకాలు సాధించిన ఏకైక బాక్సర్.
ఇది చదవండి: అథ్లెట్ అంబాసిడర్ గ్రూపులో మేరీకోమ్