ETV Bharat / sports

'హీనా, అంకుర్​కు ఖేల్​రత్న ఇవ్వండి'

షూటర్లు అంకుర్ మిత్తల్, హీనా సిద్ధు పేర్లను ఖేల్​రత్న అవార్డుకు సూచించింది జాతీయ రైఫిల్​ అసోసియేషన్​. అర్జున అవార్డుకు అన్జుమ్ మౌడ్గిల్, షాహజార్ రిజ్వీ, ఓం ప్రకాశ్ పేర్లు సిఫార్సు చేసింది.

author img

By

Published : Apr 29, 2019, 3:28 PM IST

షూటింగ్

జాతీయ రైఫిల్​ అసోసియేషన్(ఎన్​ఆర్​ఏఐ) అర్జున, ఖేల్​రత్న అవార్డులకు పలువురి క్రీడాకారుల పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అన్జుమ్​ మౌడ్గిల్, షాహజార్ రిజ్వీ, ఓం ప్రకాశ్​లను అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. హీనా సిద్ధు, అంకుర్ మిత్తల్ పేర్లను ఖేల్​రత్నకు సూచించింది ఎన్​ఆర్​ఏఐ.

10 మీట్లర్ల ఎయిర్​ పిస్టల్ ఈవెంట్​లో నిలకడగా సత్తాచాటుతోంది హీనా సిద్ధు. 2018 గోల్డ్​కోస్ట్ కామన్​వెల్త్​ పోటీల్లో రజతం నెగ్గింది. 25 మీటర్ల పిస్టల్​ ఈవెంట్​లో స్వర్ణం గెలిచింది. 2010 కామన్​వెల్త్​ క్రీడల్లోనూ పసిడి కైవసం చేసుకుందీ పంజాబీ క్రీడాకారిణి.

డబుల్​ ట్రాప్​ షూటింగ్ ఈవెంట్​లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు అంకుర్ మిత్తల్. 2018 కామన్​వెల్త్​ క్రీడల్లో కాంస్యం సాధించాడు. గతేడాది జరిగిన ఐఎస్ఎస్​ఎఫ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడీ హరియాణా ఆటగాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.