జపాన్ టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్ టెస్టు ఈవెంట్లో భారత బాక్సర్లు సత్తాచాటారు. గురువారం జరిగిన ఫైనల్లో శివథాపా, పుజా రాణి ప్రత్యర్థులను ఓడించి స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.
పురుషుల 63 కేజీల విభాగం ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన సనతాలి టొల్టయేవ్పై 5-0 తేడాతో గెలిచి స్వర్ణం సాధించాడు శివథాపా. 75 కేజీల విభాగంలో పూజారాణి ఆస్ట్రేలియా బాక్సర్ కైత్లిన్ పార్కర్‌పై విజయం సాధించి పసిడిని ఒడిసిపట్టుకుంది.
వీరిద్దరితో పాటు ఫైనల్ చేరిన ఆశిష్ (69కేజీ) జపాన్‌కు చెందిన ఒకజావా చేతిలో ఓడి రజతంతో ఆకట్టుకున్నాడు.
బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడి నిఖత్ జరీన్ (51కేజీ), సిమ్రన్‌జీత్ కౌర్ (60కేజీ), సుమిత్ సంగ్వాన్ (91కేజీ), వాలింపుయా (75కేజీ) కాంస్యాలతో సరిపెట్టుకున్నారు.
ఇవీ చూడండి.. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు మహిళా కోచ్