ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​కు సానియా దూరం, రిటైర్మెంట్​ ప్లాన్​లోనూ మార్పు - సానియా మీర్జా రిటైర్మెంట్​

స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ యూఎస్​ ఓపెన్​ నుంచి తప్పుకుంది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే తన రిటైర్మెంట్​ ప్లాన్​ను మార్చుకున్నట్లు తెలిపింది.

sania
సానియా మీర్జా
author img

By

Published : Aug 23, 2022, 3:55 PM IST

ఈ ఏడాది జరగబోయే యూఎస్​ ఓపెన్​ తర్వాత ఆటకు వీడ్కోలు చెబుతానన్న​ స్టార్ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా తన నిర్ణయాన్ని మార్చుకుంది. గాయం కారణంగా ఈ టోర్నీలో పాల్గొనలేకపోతున్నట్లు ప్రకటించింది. అందుకే తన రిటైర్మెంట్​ ప్లాన్​ను కూడా మార్చుకుంటున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ చేసింది. మోచేయికి గాయం కారణంగా టోర్నీలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించింది. తనకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పేర్కొంది.

"రెండు వారాల క్రితం కెనడాలో టెన్నిస్​ ఆడుతుండగా నా మోచేతికి గాయమైంది. సోమవారం వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్స్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. దీని కారణంగా యూఎస్​ ఓపెన్​ టోర్నీకీ దూరం కావాల్సి వచ్చింది. దీంతో నా రిటైర్మెంట్​ ప్లాన్​లో మార్చులు చేసుకున్నాను. దీనిపై మరికొద్ది రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తాను" అని సానియా మీర్జా పోస్ట్ చేసింది. కాగా, ఆగష్టు 23 నుంచి సెప్టెంబర్ 12 వరకు యూఎస్​ ఓపెన్ జరగనుంది.

ఇవీ చదవండి
టీమ్‌ఇండియాకు భారీ షాక్‌.. రాహుల్‌కు కరోనా పాజిటివ్‌
ప్రపంచ ఛాంపియన్​కు మళ్లీ భారీ షాకిచ్చిన ప్రజ్ఞానంద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.