దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల ప్రవాహం పెరుగుతూనే ఉంది. 200కు పైచిలుకు మెడల్స్‌తో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. రియో ఒలింపిక్స్ కాంస్య గ్రహీత సాక్షిమాలిక్.. అన్ని మ్యాచ్‌ల్లో గెల్చుకుంటూ వచ్చి పసిడి సొంతం చేసుకుంది.
రెజ్లింగ్‌లో భారత్ తిరుగులేకుండా దూసుకుపోతోంది. పోటీపడిన 12 విభాగాల్లోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకునేందుకు మన రెజ్లర్లు కొద్ది దూరంలోనే ఉన్నారు. 61 కేజీల విభాగంలో రవీందర్.. పాకిస్థాన్‌కు చెందిన బిలాల్‌ను ఓడించాడు.
పవన్ కుమార్(84 కేజీలు), అన్షు(59 కేజీలు) వారివారి విభాగాల్లో పసిడి సొంతం చేసుకున్నారు. చివరి రోజైన సోమవారం.. గౌరవ్ బలియాన్(74 కేజీలు), అనితా షియోరాన్(68కేజీలు) పోటీ పడనున్నారు.
భారత్ ఇప్పటివరకు మొత్తం 229 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. 119 స్వర్ణాలు, 72 రజతాలు, 38 కాంస్యాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 154 మెడల్స్‌తో(44 స్వర్ణాలు, 40 రజతాలు, 70 కాంస్యాలు) నేపాల్ రెండో స్థానంలో, 183 పతకాలతో(32 స్వర్ణాలు, 61 రజతాలు, 90 కాంస్యాలు) శ్రీలంక మూడో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్