రియో ఒలింపిక్స్ పతక గ్రహీత సాక్షి మాలిక్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో సత్తాచాటలేకపోయింది. కజకిస్థాన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో నైజీరియాకు చెందిన అమినాట్ అదెనీయి చేతిలో పరాజయం చెందింది.
62 కేజీల విభాగంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్ తొలి రౌండ్లో ప్రతర్థిపై 7-10 పాయింట్ల తేడాతో ఓడింది. ఆరంభంలో 6-0తో ముందున్న సాక్షి మాలిక్ అనంతరం వెనకబడింది. రెండో రౌండ్లో అమినాట్ పుంజుకుని 7-10 తేడాతో గెలిచింది.
మరో మ్యాచ్లో టీమిండియా రెజ్లర్ బజరంగ్ పునియా శుభారంభం చేశాడు. 65 కేజీల విభాగంలో పొలాండ్కు చెందిన క్రిస్టాఫ్ బయాంకోస్కీని 9-2 తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో తొలిసారి స్వర్ణం నెగ్గి.. ఒలింపిక్స్ బెర్త్నూ ఖరారు చేసుకోవాలనుకుంటున్నాడు పునియా.
ఇదీ చదవండి: ముందు కోహ్లీ.. తర్వాత మిల్లర్.. వాట్ ఏ క్యాచ్